Telugu Global
Business

వన్ ప్లస్ 10టీ ఫోన్‌లో కొత్త కూలింగ్ టెక్నాలజీ.. విడుదల ఎప్పుడంటే..

వన్ ప్లస్ 10టీ ఫోన్ వేడెక్కకుండా సరికొత్త టెక్నాలజీని వాడారు. ఈ మొబైల్ ఫోన్‌‌లొ తొలిసారిగా స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్ 1 చిప్ సెట్‌ను ఉపయోగించారు. దీని పెర్ఫార్మెన్స్ అత్యద్భుతంగా, వేగంగా ఉంటుంది.

వన్ ప్లస్ 10టీ ఫోన్‌లో కొత్త కూలింగ్ టెక్నాలజీ.. విడుదల ఎప్పుడంటే..
X

చైనీస్ కంపెనీ వన్ ప్లస్ త్వరలో తమ కొత్త ఫ్లాగ్ షిప్ మొబైల్ వన్ ప్లస్ 10టీని మార్కెట్లోకి విడుదల చేయనుంది. వన్ ప్లస్ ఏస్ ప్రో పేరుతో చైనాలో, వన్ ప్లస్ 10టీ పేరుతో ఇండియా సహా గ్లోబల్ మార్కెట్లోకి ఆగస్టు 3న విడుదల కానుంది. ఫ్లాగ్ షిప్ ఫోన్ల కేటగిరీలో వన్ ప్లస్ 10టీ సరికొత్త బెంచ్ మార్క్‌ను సృష్టించనున్నట్లు కంపెనీ చెబుతోంది. పెర్ఫార్మెన్ పరంగా ఇదొక అద్బుతమైన ఫోన్‌గా నిలిపోతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే వన్ ప్లస్ 10టీకి సంబంధించిన టీజర్‌ను చైనా సోషల్ మీడియా వేదిక Weiboలో విడుదల చేసింది.

వన్ ప్లస్ 10టీ ఫోన్ వేడెక్కకుండా సరికొత్త టెక్నాలజీని వాడారు. ఈ మొబైల్ ఫోన్‌‌లొ తొలిసారిగా స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్ 1 చిప్ సెట్‌ను ఉపయోగించారు. దీని పెర్ఫార్మెన్స్ అత్యద్భుతంగా, వేగంగా ఉంటుంది. అందుకే దీన్ని చల్లబర్చడానికి 'సూపర్ క్రిస్టలైన్' అనే సరికొత్త టెక్నాలజీని వాడారు. వన్ ప్లస్ 10టీ ఫోన్ వేగంగా పని చేయాలంటే థర్మల్ మేనేజ్‌మెంట్ కీలకం. అందుకే చిప్ సెట్ వేడెక్కకుండా కొత్త టెక్నాలజీని ఈ ఫోన్‌లో వాడినట్లు కంపెనీ చెప్తోంది.

టీజర్‌లో కూడా దీనికి సంబంధించిన వివరాలను సంక్షిప్తంగా అందించింది. సూపర్ క్రిస్టలైన్ గ్రాఫైట్ ఆధారిత కూలింగ్ టెక్నాలజీ దీనిలో నిక్షిప్తమై ఉంది. కూలింగ్ కోసమే ప్రత్యేకంగా బోర్డుపై అత్యధిక స్పేస్‌ను కేటాయించిన తొలి ఫోన్‌గా ఇది రికార్డు సృష్టించనుంది. అంతే కాకుండా మొబైల్స్‌లో తొలిసారిగా 8 ఛానల్ వేపర్ ఛాంబర్‌ను ఈ ఫోన్‌లో అమర్చారు. వన్ ప్లస్ 10ఆర్‌లో 4129.8 స్క్వేర్ మిల్లీమీటర్ల వైశాల్యంలో వేపర్ ఛాంబర్ ఉండగా.. 10టీలో దీని వైశాల్యం 5177 స్క్వేర్ మిల్లీమీటర్లకు పెంచినట్లు కంపెనీ స్పష్టం చేసింది. మదర్ బోర్డుపై వేడిని పుట్టించే అన్ని చిప్‌సెట్స్, పరికరాలను ఇది కూల్ చేస్తుందని వెల్లడించింది. ఈ వేపర్ ఛాంబర్‌ను కాపర్ మెటీరియల్‌తో తయారు చేయడం వల్ల థర్మల్ కండెక్టివిటీ మరింత మెరుగుపడినట్లు తెలిపింది.

వన్ ప్లస్ ఈ టెక్నాలజీని డెవలప్ చేయడానికి రెండేళ్ల పాటు పరిశోధనలు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రొడక్షన్ కోసం మరో ఏడాది వెచ్చించినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక 8 ఛానల్ వేపర్ ఛాంబర్ ఆప్టిమైజేషన్ కోసం మరో ఏడాదిన్నర ట్రయల్స్ నిర్వహించారు.

వన్ ప్లస్ 10టీ మోడల్ స్మార్ట్ ఫోన్ 16 జీబీ ర్యామ్‌తో విడుదల కానుంది. అంతే కాకుండా రోమ్ కెపాసిటీ 512 జీబీగా ఉంది. ఇందులో హైపర్ బూస్ట్ గేమింగ్ ఇంజన్ జీపీఏ 3.0 ఉంది. 6.78 ఇంచుల ఫుల్ హెచ్‌డీ AMOLED డిస్‌ప్లే 120 హెర్జ్ రిఫ్రెష్ రేటుతో వస్తుంది. దీని ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా.. వీటికి తోడు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలకు కూడా వెనుక వైపు అమర్చారు. ఇక ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్‌తో వస్తుంది. ఇందులో 2300 mAh డ్యూయల్ సెల్ బ్యాటరీని అమర్చారు. ఇది 150వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్‌తో ఇది పని చేస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 45,000 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

First Published:  28 July 2022 9:01 PM IST
Next Story