Telugu Global
Business

మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్.. ఏది బెస్ట్ ఆప్షన్?

లాంగ్ టర్మ్‌లో ఎక్కువ సంపాదించాలంటే సేవింగ్స్‌కు బదులు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకునేవాళ్లకు మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ స్టాక్స్.. రెండు ఆప్షన్లు ఉంటాయి.

మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్.. ఏది బెస్ట్ ఆప్షన్?
X

లాంగ్ టర్మ్‌లో ఎక్కువ సంపాదించాలంటే సేవింగ్స్‌కు బదులు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకునేవాళ్లకు మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ స్టాక్స్.. రెండు ఆప్షన్లు ఉంటాయి. మరి వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్?

డబ్బుని బ్యాంక్ ఖాతాల్లో ఉంచడం కంటే వాటిని ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మరింత లాభం ఉంటుంది. ఈక్విటీ అంటే దేశంలో జరుగుతున్న బిజినెస్ యాక్టివిటీ అని అర్థం. అంటే మీ డబ్బుని రకరకాల బిజినెస్‌లలో ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. అంటే మీరు ఎంచుకున్న రంగాలు లాభాల బాట పడుతుంటే మీ డబ్బు కూడా పెరుగుతుంటుంది. అయితే ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో ఎవరు దేన్ని ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేందుకు ఉన్న మొదటి ఆప్షన్ స్టాక్స్. ఒక కంపెనీని ఎంచుకుని దాని స్టాక్స్‌ను నేరుగా కొనుగోలు చేయడం ద్వారా ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ఈ తరహా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రిస్క్ ఎక్కువ. కంపెనీ స్టాక్ వాల్యూస్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలిసిన వాళ్లు, స్టాక్ మార్కెట్‌పై పూర్తి అవగాహన ఉన్నవాళ్లూ ఈ తరహా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు.

ఇక మ్యూచువల్ ఫండ్స్ అంటే మీ డబ్బుని చిన్న మొత్తాల్లో విడగొట్టి రకరకాల కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబడిగా పెడతారు. ఇక్కడ మీ తరఫున ఓ నిపుణుడైన ఫండ్ మేనేజర్ మీ డబ్బుని మ్యానేజ్ చేస్తాడు. రకరకాల మ్యూచువల్ ఫండ్స్ రకరకాల ప్లాన్స్ రూపంలో ఈ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేనివాళ్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.

అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి లాభాలు పొందాలంటే కనీసం 5- నుంచి 7 సంవత్సరాలు ఓపిక పట్టాలి. స్టాక్స్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా దీర్ఘకాలిక పెట్టుబడులుగా ఎంచుకోవాలి. అప్పుడే పెద్దమొత్తంలో లాభం కనిపిస్తుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకేసారి కాకుండా నెలకు కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసే సదుపాయం కూడా ఉంది. దాన్నే ఎస్‌ఐపి(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) అంటారు.

ఇక ఈ రెండింటితోపాటు గవర్నమెంట్ బాండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్ రూపంలో ప్రభుత్వం పెట్టుబడులను అనుమతిస్తుంది. ఇవి కూడా సేఫ్ అండ్ సెక్యూర్ ఆప్షన్స్. ఇందులో కూడా లాంగ్ టర్మ్‌లో మంచి లాభాలు ఆర్జించొచ్చు.

First Published:  11 April 2024 7:41 AM IST
Next Story