ఈ నెలలో రిలీజ్ అయ్యే మొబైల్స్ ఇవే.. | Mobiles to be released in the September
Telugu Global
Business

ఈ నెలలో రిలీజ్ అయ్యే మొబైల్స్ ఇవే..

ఈ నెలలో రిలీజ్ అయ్యే మొబైల్స్ ఇవే..
X

ప్రస్తుతం మార్కెట్లో ప్రీమియం, మిడ్ రేంజ్ ఫోన్ల హవా నడుస్తోంది. తక్కువ ధరకే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌ ఉండే మోడల్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెలలో కొన్ని మిడ్ రేంజ్, ప్రీమియం మొబైల్స్ రాబోతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..

ఐఫోన్‌ 14 సిరీస్

ఈ నెల 7న యాపిల్‌ కంపెనీ ఐపోన్‌ 14 సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో నాలుగు మోడల్స్‌ విడుదలవుతున్నాయి. వీటిలో ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 మ్యాక్స్‌, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ ఉన్నాయి. వీటితోపాటు మూడు ఐపాడ్ మోడల్స్‌ను యాపిల్ విడుదల చేస్తుంది. ఐపాడ్ 10.2 (10 జనరేషన్‌), ఐపాడ్‌ ప్రో 12.9 (ఆరో జనరేషన్‌), ఐపాడ్‌ ప్రో 11 (నాలుగో జనరేషన్‌) ఉన్నాయి.

అసుస్‌ ఆర్‌‌ఓజీ ఫోన్‌ 6

ఆసుస్ నుంచి ప్రీమియం గేమింగ్ ఫోన్ ఆర్‌‌ఓజీ 6 ఈ నెలలో విడుదల కానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 165 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు మరో రెండు కెమెరాలు ఉన్నాయి. 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో లభించనుంది. సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో విడుదల కావ‌చ్చు.

మోటో ఎడ్జ్‌ 30 అల్ట్రా

200 ఎంపీ ప్రైమరీ కెమెరా, 108 ఎంపీ సెకండరీ కెమెరాతో మోటో ఎడ్జ్‌ 30 అల్ట్రా సెప్టెంబరు ఫస్ట్ వీక్‌లో విడుదల కానుంది. మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయి. వెనుక మూడు, ముందు ఒకటి. 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ ఉపయోగించారు.

మోటో ఎడ్జ్‌ 30 ఫ్యూజన్‌

ఎడ్జ్ 30 అల్ట్రాతో పాటు మోటో కంపెనీ మోటో ఎడ్జ్‌ 30 ఫ్యూజన్‌ను విడుదల చేయనుంది. 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్ డ్రాగన్‌ 888+ ప్రాసెసర్‌ ఉపయోగించారు. 4,400 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.

షావోమి 12టీ సిరీస్‌

ఈ నెలలో షావోమి 12 సిరీస్‌ నుంచి కొత్త మోడల్స్ రానున్నాయి. ప్రీమియం కేటగిరీలో వస్తున్న 12టీ, 12టీ ప్రో, 12టీ+ ఫోన్లలో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 2కె అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ ఉపయోగించారు. లైకా కెమెరా సెటప్‌ ఉంది. సెప్టెంబరు రెండో వారంలో ఈ ఫోన్‌ విడుదలకానుంది. ఇందులో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 120 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది.

షావోమి 12 లైట్‌

షావోమి12 లైట్‌ మీడియం రేంజ్ ఫోన్ కూడా ఈ నెలలోనే విడుదలవుతోంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్‌ డాట్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుక 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలున్నాయి. 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 778జీ ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 4,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67 వాట్ టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ/128 జీబీ, 8 జీబీ/ 256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో విడుదల కానుంది.

రియల్‌మీ జీటీ నియో 3టీ

జీటీ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను తీసుకొస్తుంది రియల్ మీ. రియల్‌మీ జీటీ నియో 3టీ పేరుతో రాబోతున్న ఈ మోడల్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌ ఉపయోగించారు. సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో విడుదల కానుంది.

వన్‌ప్లస్ నార్డ్‌ ఎన్‌20 ఎస్‌ఈ

వన్ ప్లస్ నుంచి నార్డ్ ఎన్ 20 ఎస్ ఈ ఫోన్‌ ఈ నెలలో రాబోతుంది. ఇందులో 6.56 అంగుళాల కలర్‌-రిచ్ డిస్‌ప్లే, వెనుక 50 ఎంపీ ఏఐ డ్యూయల్‌ కెమెరా ఉంటుంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్ సూపర్‌వోక్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3

ఇదే నెలలో వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 మోడల్‌ కూడా విడుదలకానుంది. 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేతో ఉండే ఈ ఫోన్‌లో మీడియాటెక్ 8100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు మరో రెండు కెమెరాలు ఉంటాయి. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ సూపర్ ఫ్లాష్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఐకూ నియో 7

ఐకూ కంపెనీ నియో7 ఫోన్‌ను ఈ నెలలో విడుదల చేయనుంది. ఇందులో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్‌ ఉపయోగించారు. 120 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

ఇక వీటితో పాటు పోకో ఎం5 5జీ, రియల్‌మీ 10/11 సిరీస్‌ , రియల్‌మీ క్యూ5 , రియల్‌మీ సీ33 , వివో వీ25 సిరీస్‌ , ఐకూ జెడ్‌5 లైట్‌, రియల్‌మీ జీటీ 3 వంటి మరికొన్ని మొబైల్స్ కూడా ఇదే నెలలో రిలీజ్ కానున్నాయి.

First Published:  3 Sept 2022 9:45 AM
Next Story