Market Capitalisation | 5.33 లక్షల కోట్లు దాటిన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్.. 80 వేల పై చిలుకు మైలురాయికి సెన్సెక్స్..!
Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం మరో జీవిత కాల రికార్డు నమోదైంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ చారిత్రక స్థాయిలో 80 వేల మార్క్‌ను దాటింది.
Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం మరో జీవిత కాల రికార్డు నమోదైంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ చారిత్రక స్థాయిలో 80 వేల మార్క్‌ను దాటింది. బీఎస్ఈ చరిత్రలో సెన్సెక్స్ 80 వేల మార్క్‌ను దాటడం ఇదే ఫస్ట్ టైం. మరోవైపు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్‌టైం రికార్డు రూ.445.43 లక్షల కోట్లకు చేరుకున్నది. బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అంతర్గత ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 632.85 పాయింట్లు (0.79 శాతం) లబ్ధి పొంది 80,074.30 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 545.35 పాయింట్లు వృద్ధి చెంది 80 వేల మార్కుకు స్వల్పంగా దిగువన 79,986.80 పాయింట్ల వద్ద స్థిర పడింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రికార్డు స్థాయిలో రూ.4,45,43,642.29 కోట్ల (5.33 లక్షల కోట్ల అమెరికా డాలర్లు)కు చేరుకున్నది.
ఇంతకుముందు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ గత నెల 25న 78 వేల మార్క్, 27న 79 వేల మార్కును దాటేసింది. బుధవారం ట్రేడింగ్‌లో బీఎస్ఈ -30 ఇండెక్స్‌లో అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పవర్ గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ పైనాన్స్, టాటా స్టీల్ స్టాక్స్ భారీగా లబ్ధి పొందాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టర్బో భారీ నష్టాలతో ముగిశాయి.
గ్లోబల్ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు భారత్ దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ కనిపించింది. టెలికంతోపాటు అన్ని సెక్టార్లు లాభాలతో ముగిశాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ స్టాక్స్ దన్నుతో సెన్సెక్స్ 80కే మార్క్‌ను బ్రేక్ చేసింది అని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ (రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే చెప్పారు. బ్రాడర్ మార్కెట్లలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.86 శాతం, స్మాల్ క్యాప్ 0.86 శాతం చొప్పున వృద్ధి చెందాయి.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో బ్యాంకింగ్ 1.75 శాతం, ఫైనాన్సియల్ సర్వీసెస్ 1.55 శాతం, టెలికం 1.44, సర్వీసెస్ 1.18 శాతం, ఇండస్ట్రీయల్స్ 1.09 శాతం, ఎఫ్ఎంసీజీ 0.81 శాతం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ - 30 ఇండెక్స్‌లో 2,355 స్టాక్స్ లాభ పడగా, 1,566 స్క్రిప్ట్‌లు నష్టాలతో ముగిశాయి. మరో 100 స్టాక్స్ యధాతథంగా కొనసాగాయి. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.83.52 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడాయిల్ 86.30 డాలర్లు పలుకుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం (24 క్యారట్స్) ధర 2356 డాలర్ల వద్ద ట్రేడయింది.