Telugu Global
Business

Maruti Suzuki Jimny: మార్కెట్లోకి మారుతి జిమ్నీ.. య‌మ కాస్ట్‌లీ.. సెకండ్ కారు ఆప్ష‌న్‌కే బెస్ట్‌..!

Maruti Suzuki Jimny: మారుతి సుజుకి త‌న ఫైవ్ డోర్ ఆఫ్ రోడ‌ర్ ఎస్‌యూవీ కారు జిమ్నీ బుధ‌వారం భార‌త్ మార్కెట్లోకి తెచ్చింది.

Maruti Suzuki Jimny: మార్కెట్లోకి మారుతి జిమ్నీ.. య‌మ కాస్ట్‌లీ.. సెకండ్ కారు ఆప్ష‌న్‌కే బెస్ట్‌..!
X

Maruti Suzuki Jimny: మార్కెట్లోకి మారుతి జిమ్నీ.. య‌మ కాస్ట్‌లీ.. సెకండ్ కారు ఆప్ష‌న్‌కే బెస్ట్‌..!

మారుతి సుజుకి త‌న ఫైవ్ డోర్ ఆఫ్ రోడ‌ర్ ఎస్‌యూవీ కారు జిమ్నీ బుధ‌వారం భార‌త్ మార్కెట్లోకి తెచ్చింది. దీని ధ‌ర రూ.12.74 ల‌క్ష‌ల నుంచి మొద‌లై టాప్ హై ఎండ్ వేరియంట్ ధ‌ర రూ.15.05 ల‌క్ష‌లు ప‌లుకుతుంది. బుధ‌వారం నుంచే క‌స్ట‌మ‌ర్ల‌కు కార్ల డెలివ‌రీ ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. గ‌త జ‌న‌వ‌రి 12న ఆటో ఎక్స్‌పోలో ఈ కారును ప్ర‌ద‌ర్శించిన మారుతి సుజుకి నాటి నుంచి కస్ట‌మ‌ర్ల నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నా, షో-ఆఫ్ వాల్యూ ఉన్నా, ఆఫ్ రోడ‌ర్ ఎస్‌యూవీగా క్యూట్‌గా ఉన్నా జిమ్నీ కారు ధ‌ర మాత్రం రోజువారీ ప్ర‌యాణం చేసేవారికి అంత ఆచ‌ర‌ణ‌యోగ్యం కాద‌ని చెబుతున్నారు. వారాంతంలో గానీ, రెండు మూడు నెల‌ల‌కోసారి గానీ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి జాలీ ట్రిప్‌ల‌కు వెళ్లే వారిలో సెకండ్ కారు కోసం చూస్తున్నవారికి సూట‌బుల్ ఈ కారు. జిప్సీ కారు వార‌స‌త్వాన్ని విజ‌యవంతంగా ముందుకు తీసుకెళ్తున్న‌ది.

ఈ ఎస్‌యూవీ కారు కే15బీ 15 లీట‌ర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వ‌స్తున్న‌ది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 105 పీఎస్ విద్యుత్‌, 134 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. లాడ‌ర్ ఫ్రేమ్ చాసిస్‌తోపాటు ఆల్ గ్రిప్ ప్రో 4డ‌బ్ల్యూడీ టెక్నాల‌జీ విత్ లో రేంజ్ ట్రాన్స్‌ఫ‌ర్ గేర్ (4ఎల్ మోడ్‌) ప్రామాణికంగా ఉంటుంది. 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ కారు ఇంజిన్ లీట‌ర్ పెట్రోల్‌పై 16.94 కి.మీ. మైలేజీ, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ కారు ఇంజిన్ లీట‌ర్ పెట్రోల్ మీద 16.39 కి.మీ. మైలేజీ ఇస్తుంది.

జెటా, ఆల్ఫా వేరియంట్ల‌లో మారుతి జిమ్నీ కారు ల‌భిస్తుంది. వాటి ద‌ర‌లు ఇలా ..

జెటా మాన్యువ‌ల్ ట్రాన్స్ మిష‌న్ (ఎంటీ) - రూ.12.74 ల‌క్ష‌లు

జెటా ఆటోమేటిక్‌ ట్రాన్స్ మిష‌న్ (ఎటీ) - రూ.13.94 ల‌క్ష‌లు

అల్ఫా మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ (ఎంటీ) - రూ.13.69 ల‌క్ష‌లు

అల్ఫా ఆటోమేటిక్‌ ట్రాన్స్ మిష‌న్ (ఎటీ) - రూ.14.89 ల‌క్ష‌లు

అల్ఫా మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్- ఎంటీ (డ్యుయ‌ల్ టోన్‌) - రూ.13.85 ల‌క్ష‌లు

అల్ఫా ఆటోమేటిక్ ట్రాన్స్ మిష‌న్ -ఏటీ (డ్యుయ‌ల్ టోన్‌) - రూ.15.05 ల‌క్ష‌లు

ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ విత్ ఏ వాష‌ర్‌, ఆటోమ్యాటిక్ హెడ్ ల్యాంప్స్‌, ఫాగ్ ల్యాంప్స్‌, ఎలక్ట్రిక‌ల్లీ అడ్జ‌స్ట‌బుల్ అండ్ రీట్రాక్ట‌బుల్ ఓఆర్వీఎంస్‌, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్‌, డ్రిప్ రెయిల్స్‌, క్లామ్‌షెల్ బాయ్‌నెట్‌, టెయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ వంటి ఫీచ‌ర్లు ఉంటాయి. కారు లోప‌ల 9-అంగుళా స్మార్ట్ ప్రో + ఇన్ఫోటైన్మెంట్ సిస్ట‌మ్ విత్ హెచ్‌డీ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో క‌నెక్టివిటీ, ఆర్‌క్యామ్స్ స‌రౌండ్ సౌండ్ సిస్ట‌మ్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచ‌ర్లు జ‌త చేశారు.

సేఫ్టీ కోసం 6-ఎయిర్ బ్యాగ్స్‌, బ్రేక్ లిమిటెడ్ స్లిప్ డిఫ‌రెన్షియ‌ల్‌, ఎల‌క్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌, హిల్ హోల్డ్ అసిస్ట్‌, హిల్ డిసెంట్ కంట్రోల్‌, రేర్ వ్యూ కెమెరా, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్‌, ఏబీఎస్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. మారుతి సుజుకి ఎస్‌యూవీ పోర్టు పోలియోలో ఫ్రాంక్స్‌, బ్రెజా, గ్రాండ్ విటారాతో క‌లిసి జిమ్నీ జ‌త చేరింది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎస్‌యూవీ మార్కెట్‌లో 25 శాతం వాటా సంపాదించాల‌న్న ల‌క్ష్యంతో మారుతి సుజుకి సాగుతున్న‌ది.

First Published:  7 Jun 2023 3:16 PM IST
Next Story