Maruti Invicto | ఎలక్ట్రిక్ కం పెట్రోల్ కాంబినేషన్.. ఇదీ మారుతి ఇన్‌విక్టో స్పెషాలిటీ..!
Maruti Suzuki Invicto | మారుతి సుజుకి ఇన్‌విక్టో వేరియంట్ల వారీ ధరలు
Maruti Invicto | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి. మార్కెట్‌లోనూ అగ్రస్థానం మారుతిదే. అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఇతర కంపెనీల నుంచి పోటీ పెరుగుతోంది. కర్బన ఉద్గారాల నియంత్రణకు ఆల్టర్నేటివ్ ఫ్యుయల్ ఆప్షన్ `ఎలక్ట్రిక్` వినియోగ కార్లు వచ్చేశాయి. ఈ తరుణంలో మారుతి సుజుకి మల్టీపర్పస్ వెహికల్ (ఎంవీపీ) ఇన్‌విక్టో (Invicto) తెచ్చింది.
ఈ కారు ఇంజిన్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రిక్ హైబ్రీడ్ సిస్టమ్ విత్ 2.0- లీటర్ల పెట్రోల్ ఇంజిన్/ ఈ-సీవీటీ ఇంజిన్‌తో వచ్చింది. పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ గరిష్టంగా 150 హెచ్‌పీ విద్యుత్, ఎలక్ట్రిక్ మోటార్ ఇంజిన్ 112 హెచ్‌పీ విద్యుత్, పెట్రోల్ ఇంజిన్ 188 ఎన్ఎం, ఎలక్ట్రిక్ వేరియంట్ ఈ-సీవీటీ మోటార్ 206 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. దీని ధర రూ.24.79 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ రూ.28.42 లక్షల (ఎక్స్ షోరూమ్) కు లభిస్తుంది. మారుతి ఇన్‌విక్టో నాలుగు డ్రైవ్ మోడ్‌లు - ఈవీ, నార్మల్, ఈకో, పవర్ మోడ్‌ల్లో లభిస్తుంది.
మారుతి సుజుకి ఇన్‌విక్టో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల కలర్డ్ ఎంఐడీ విత్ డ్రైవ్ మోడ్ థీమ్స్, రేర్ సన్‌షేడ్, పవర్డ్ టెయిల్ గేట్, 360-డిగ్రీల వ్యూ మానిటర్, అంబియెంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది. 8-వే పవర్డ్ డ్రైవర్ సీట్ విత్ మెమరీ ఫంక్షన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఫ్రంట్ అండ్ రేర్ వరుసల్లో డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 50కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. ఇన్‌విక్టో కారు సుజుకి కనెక్ట్ టెక్నాలజీతో పని చేస్తుంది.
ప్రయాణికుల సేఫ్టీ కోసం ఇన్‌విక్టో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ (ఫ్రంట్, సైడ్, కర్టైన్), ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ఏబీఎస్ విత్ ఈబీడీ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ విత్ హిల్ హోల్డ్ అసిస్ట్, త్రీ పాయింట్ సీట్ బెల్టులు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్‌విక్టో లీటర్ పెట్రోల్‌పై 23.24 కి.మీ. మైలేజీ లభిస్తుంది. హైబ్రీడ్ వర్షన్ సిస్టమ్‌తో పని చేస్తున్న ఇన్‌విక్టో హైబ్రీడ్ సిస్టమ్ బ్యాటరీకి ఎనిమిదేండ్లు లేదా 1.60 లక్షల కి.మీ. స్టాండర్డ్ వారంటీ అందిస్తున్నారు. ఎన్ఐఎంహెచ్ (NiMH) - నిఖిల్-మెటల్ హైడ్రైడ్ (Nickel-Metal Hydride) బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. నెక్సా బ్లూ, మిస్టిక్ వైట్, మెజిస్టిక్ సిల్వర్, స్టెల్లార్ బ్రాంచ్ కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది.
మారుతి సుజుకి ఇన్‌విక్టో వేరియంట్ల వారీ ధరలు:
మారుతి ఇన్‌విక్టో ఎంవీపీ జెటా +, ఆల్ఫా + వేరియంట్లలో ఏడు లేదా ఎనిమిది సీట్ల కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.
♦ ఇన్‌విక్టో జెటా + 7 సీటర్ రూ.24.79 లక్షలు
♦ ఇన్‌విక్టో జెటా + 8 సీటర్ రూ.24.84 లక్షలు
♦ ఇన్‌విక్టో ఆల్ఫా + 7 సీటర్ రూ.28.42 లక్షలు.