Telugu Global
Business

Maruti Tour H1 | ఆల్టో కే-10 టెక్నాల‌జీతో మారుతి క‌మ‌ర్షియ‌ల్ హ్యాచ్ బ్యాక్ టూర్ హెచ్‌1.. ధ‌రెంతో తెలుసా?!

Maruti Tour H1 | దేశీయంగా అతిపెద్ద కార్ల త‌య‌రీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki). విభిన్న వ‌ర్గాల క‌స్ట‌మ‌ర్ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా, అందుబాటు ధ‌ర‌ల్లో మోడ‌ల్స్ డిజైన్ చేయ‌డంలోనూ ముందు వ‌రుస‌లో నిలుస్తుంది.

Maruti Tour H1 | ఆల్టో కే-10 టెక్నాల‌జీతో మారుతి క‌మ‌ర్షియ‌ల్ హ్యాచ్ బ్యాక్ టూర్ హెచ్‌1.. ధ‌రెంతో తెలుసా?!
X

Maruti Tour H1 | ఆల్టో కే-10 టెక్నాల‌జీతో మారుతి క‌మ‌ర్షియ‌ల్ హ్యాచ్ బ్యాక్ టూర్ హెచ్‌1.. ధ‌రెంతో తెలుసా?!

Maruti Tour H1 | దేశీయంగా అతిపెద్ద కార్ల త‌య‌రీ సంస్థ మారుతి సుజుకి. విభిన్న వ‌ర్గాల క‌స్ట‌మ‌ర్ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా, అందుబాటు ధ‌ర‌ల్లో మోడ‌ల్స్ డిజైన్ చేయ‌డంలోనూ ముందు వ‌రుస‌లో నిలుస్తుంది. తాజాగా ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10) టెక్నాల‌జీ బేస్డ్ క‌మ‌ర్షియ‌ల్ హ్యాచ్ బ్యాక్ (commercial hatchback) `టూర్ హెచ్‌1 (Tour H1)`మార్కెట్లో ఆవిష్క‌రించింది. దీని ధ‌ర రూ.4.80 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించింది. కొత్త‌గా క‌మ‌ర్షియ‌ల్ అవ‌స‌రాల‌కు ఉప‌యోగ ప‌డే ఈ హ్యాచ్ బ్యాక్ టూర్ హెచ్‌1 (Tour H1) మార్కెట్‌లో మూడు క‌ల‌ర్స్ - మెటాలిక్ సిల్కీ సిల్వ‌ర్ (Metallic Silky Silver), మెటాలిక్ గ్రానైట్ గ్రే (Metallic Granite Grey), ఆర్కిటిక్ వైట్ (Arctic White) ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది.



కే-సిరీస్ నెక్ట్స్ జ‌న‌రేష‌న్ టెక్నాల‌జీతో రూపు దిద్దుకున్న టూర్ హెచ్‌1 (Tour H1) కారు 1.0-లీట‌ర్ల డ్యుయ‌ల్ జెట్‌, డ్యుయ‌ల్ వీవీటీ ఇంజిన్‌తో వ‌స్తున్న‌ది. పెట్రోల్ వేరియంట్ 66.6 పీఎస్ విద్యుత్ + 89 ఎన్ఎం టార్చి, సీఎన్జీ వేరియంట్ 56.6 పీఎస్ విద్యుత్ +82.1 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. 5-స్పీడ్ మాన్యువ‌ల్ గేర్ బాక్స్‌తో రూపుదిద్దుకున్న‌ది.

మారుతి సుజుకి టూర్ హెచ్‌1 (Tour H1) పెట్రోల్ వేరియంట్.. లీట‌ర్ పెట్రోల్‌పై 24.60 కి.మీ, సీఎన్జీ వేరియంట్ కిలో సీఎన్జీపై 34.46 కి.మీ. మైలేజీనిస్తుంది.


ప్ర‌యాణికుల సేఫ్టీ కోసం టూర్ హెచ్1 (Tour H1)లో డ్యుయ‌ల్ ఎయిర్ బ్యాగులు, ఫ్రంట్ సీట్ బెల్ట్స్ విత్ ప్రీ టెన్ష‌న‌ర్‌, ఫోర్స్ లిమిట‌ర్‌, ముందూ వెనుక సీట్ల‌లో కూర్చుకునే ప్ర‌యాణికుల‌కు సీట్ బెల్ట్ రిమైండ‌ర్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజ‌ర్‌, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్పీడ్ లిమిటింగ్ సిస్ట‌మ్‌, రివ‌ర్స్ పార్కింగ్ సెన్స‌ర్లు త‌దిత‌ర ఫీచ‌ర్లు జ‌త చేశారు.

వేరియంట్ల వారీగా టూర్ హెచ్‌1 ధ‌ర‌లు

టూర్ హెచ్‌1 పెట్రోల్ - రూ.4.80 ల‌క్ష‌లు.

టూర్ హెచ్‌1 సీఎన్జీ - రూ.5.70 ల‌క్ష‌లు.

First Published:  10 Jun 2023 12:44 PM IST
Next Story