Telugu Global
Business

5-డోర్ థార్ రూ.2 ల‌క్ష‌లు కాస్ట్‌లీ.. ఎల‌క్ట్రిక్ స‌న్‌రూఫ్ కూడా..!

దేశీయ ఆటోమొబైల్ సంస్థ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) (ఎం&ఎం) వ‌చ్చే ఏడాది అంటే 2024లో 5-డోర్ థార్ (Thar) ఆవిష్క‌రించ‌నున్న‌ది.

Mahindra Thar: 5-డోర్ థార్ రూ.2 ల‌క్ష‌లు కాస్ట్‌లీ.. ఎల‌క్ట్రిక్ స‌న్‌రూఫ్ కూడా..!
X

5-డోర్ థార్ రూ.2 ల‌క్ష‌లు కాస్ట్‌లీ.. ఎల‌క్ట్రిక్ స‌న్‌రూఫ్ కూడా..!

దేశీయ ఆటోమొబైల్ సంస్థ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) (ఎం&ఎం) వ‌చ్చే ఏడాది అంటే 2024లో 5-డోర్ థార్ (Thar) ఆవిష్క‌రించ‌నున్న‌ది. మ‌హీంద్రా 5-డోర్ థార్ కొనుగోలు చేయాల‌ని భావిస్తున్న కార్ల ప్రియుల‌కు మ‌హీంద్రా కొత్త ఫీచ‌ర్ అందిస్తున్న‌ట్లు తెలిపింది. స‌న్‌రూఫ్ ఎల‌క్ట్రిక్ సన్‌రూఫ్‌తో 5-డోర్ థార్‌ వ‌స్తుంద‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో వ‌చ్చిన చిత్రాల ప్ర‌కారం తెలుస్తున్న‌ది.

ఇప్ప‌టికైతే 3-డోర్ థార్‌కు ఎల‌క్ట్రిక్ స‌న్‌రూఫ్ లేదు. 3-డోర్ థార్‌తో పోలిస్తే 5-డోర్ థార్ టాప్ స్టాండ‌ర్డ్ కారు కన్వ‌ర్ట‌బిలిటీ టాప్ అండ్ హార్డ్ ఆప్ష‌న్లు క‌లిగి ఉంటుంది. 5-డోర్ థార్ 2023లో మార్కెట్లోకి తేవ‌డం లేద‌ని, 2024లో ఆవిష్క‌రిస్తున్నామ‌ని మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఆటో అండ్ ఫామ్ సెక్టార్ సీఈఓ రాజేష్ జెజూరిక‌ర్ ఇటీవ‌ల వెల్ల‌డించారు. అంతేకాదు, 3-డోర్ థార్ కారు ధ‌ర‌తో పోలిస్తే 5-డోర్ ధ‌ర రూ.2 ల‌క్ష‌లు ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది.

3-డోర్ థార్ త్రీ ఇంజిన్ ఆప్ష‌న్ల‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. 1.5-లీట‌ర్ల డీ117 సీఆర్‌డీఈ డీజిల్ (117 బీహెచ్‌పీ విద్యుత్‌/ 300 ఎన్ఎం టార్చి), 2.2-లీట‌ర్ల ఎం-హాక్ 130 సీఆర్‌డీఈ డీజిల్‌ (130బీహెచ్‌పీ /300 ఎన్ఎం), 2.0- లీట‌ర్ల ఎంస్టాలియ‌న్ 150 టీజీడీఐ పెట్రోల్ (150 బీహెచ్‌పీ /320 ఎన్ఎం) ఆప్ష‌న్ ఇంజిన్లతో 3-డోర్ థార్ వ‌స్తున్న‌ది. 1.5-లీట‌ర్ల డీజిల్ ఇంజిన్ వేరియంట్ కారు 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ క‌లిగి ఉంటుంది. 2.2-లీట‌ర్ల డీజిల్, 2.0-లీట‌ర్ల పెట్రోల్ వేరియంట్లు 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ చాయిస్‌ల్లో ల‌భిస్తుంది.

ఈ ఏడాది ప్రారంభంలో 3-డోర్ థార్ కారులో ఆర్‌డ‌బ్ల్యూడీ వేరియంట్ ఆవిష్క‌రించింది. 2020 అక్టోబ‌ర్‌లో తొలుత 4డ‌బ్ల్యూడీ స్టాండ‌ర్డ్ 3-డోర్ థార్ కారును మార్కెట్లోకి తెచ్చింది. 3-డోర్ థార్ ధ‌ర రూ.10,54,500 నుంచి రూ.16,77,501 వ‌ర‌కు ల‌భిస్తుంది. వ‌చ్చే ఏడాది మార్కెట్‌లోకి అందుబాటులోకి వ‌చ్చే 5-డోర్ థార్ ధ‌ర మ‌రో రూ.2 ల‌క్ష‌లు ఎక్కువ ధ‌ర ఉండొచ్చున‌ని తెలుస్తున్న‌ది.

First Published:  31 May 2023 4:03 PM IST
Next Story