Mahindra Scorpio-N | పెరిగిన మహీంద్రా ఎస్‌యూవీ స్కార్పియో-ఎన్ ధర.. ఏడాదిలో మూడోసారి..!
మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ ఐదు వేరియంట్లు- జడ్2, జడ్4, జడ్6, జడ్8, జడ్8ఎల్ మోడల్స్‌గా వస్తోంది. ఈ ఐదు వేరియంట్లు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి.
Mahindra Scorpio-N | మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ స్కార్పియో-ఎన్ (Scorpio-N).. దేశీయ మార్కెట్లో పాపులర్ ఎస్‌యూవీ కార్లలో ఇదొకటి. ఫెస్టివల్ సీజన్ ప్రారంభం అవుతున్న తరుణంలో స్కార్పియో-ఎన్ (Scorpio-N) పై మహీంద్రా (Mahindra) కీలక నిర్ణయం తీసుకుంది. స్కార్పియో-ఎన్ (Scorpio-N) ధర మరోమారు పెంచేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) అధికారిక వెబ్‌సైట్ ప్రకారం స్కార్పియో-ఎన్ (Scorpio-N) ధర కనీసం రూ.21 వేలు పెరిగింది. ఎంట్రీ లెవల్ జడ్2 పెట్రోల్ విత్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ ధర రూ.13.26 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఏడాది కాలంలో స్కార్పియో-ఎన్ ధర పెంచడం ఇది మూడోసారి. వరుసగా ధర పెంచడానికి మాత్రం కారణాలేమిటో వెల్లడించలేదు.
మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ ఐదు వేరియంట్లు- జడ్2, జడ్4, జడ్6, జడ్8, జడ్8ఎల్ మోడల్స్‌గా వస్తోంది. ఈ ఐదు వేరియంట్లు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి. ఎంట్రీ లెవల్ డీజిల్ వేరియంట్ జడ్2 విత్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కారు ధర రూ.13.76 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
టాప్ హై ఎండ్ డీజిల్ వేరియంట్ జడ్8ఎల్ 4డబ్ల్యూడీ విత్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరింత ఖర్చుతో కూడుకుంది. తాజాగా మరో రూ.2000 పెరిగి రూ.24.53 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. టాప్ హై ఎండ్ వేరియంట్ పెట్రోల్ జడ్8ఎల్ సిక్స్ సీటర్ విత్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కారు ధర రూ.21.78 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతోంది. జడ్4ఈ డీజిల్ 4డబ్ల్యూడీ వేరియంట్ విత్ సెవెన్ సీటర్ అండ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కారు ధర గరిష్టంగా రూ.81 వేలు పెరిగి రూ.18.50 లక్షలు (ఎక్స్ షోరూమ్) వద్దకు చేరింది.
స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ కారు 2.0 లీటర్ల టర్బో చార్జ్‌డ్ పెట్రోల్ యూనిట్ కలిగి ఉంది. ఈ కారు ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 197 బీహెచ్పీ విద్యుత్, 380 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ విత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 173 బీహెచ్పీ విద్యుత్, 400 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
మహీంద్రా స్కార్పియో బ్రాండ్ కింద స్కార్పియో-ఎన్ (Scorpio-N), స్కార్పియో క్లాసిక్ (Scorpio Classic) ఎస్‌యూవీ మోడల్స్ విక్రయిస్తుంది. మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఎస్‌యూవీ కార్ల విక్రయాల్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్ ఇది. సగటున 9,000 యూనిట్లకు పైగా మార్కెట్‌లో విక్రయిస్తుంది మహీంద్రా.
♦