Mahindra XUV400 EV | మహీంద్రా బంఫర్ ఆఫర్.. ఆ మోడల్ కారుపై భారీ డిస్కౌంట్.. ఎంతంటే..?!
Mahindra XUV400 EV | సంప్రదాయ కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి దూసుకెళ్తున్నా.. విద్యుత్ కార్ల సెగ్మెంట్ మాత్రం దేశీయ సంస్థలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలదే. మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లలో `ఎక్స్‌యూవీ400 `ఎక్స్‌యూవీ అత్యంత పాపులర్.
Mahindra XUV400 EV | సంప్రదాయ కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి దూసుకెళ్తున్నా.. విద్యుత్ కార్ల సెగ్మెంట్ మాత్రం దేశీయ సంస్థలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలదే. మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లలో `ఎక్స్‌యూవీ400 `ఎక్స్‌యూవీ అత్యంత పాపులర్. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో కస్టమర్లకు చేరువయ్యేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా తన `ఎక్స్‌యూవీ400 ఈవీ` ఎస్‌యూవీపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దాదాపు రూ.1.25 లక్షల డిస్కౌంట్ అందిస్తున్నది. త్వరలో `ఎక్స్‌యూవీ400 ఫేస్‌లిఫ్ట్` ఆవిష్కరిస్తుందన్న అంచనాల మధ్య ఈ నెలలో తన ఈవీ ఎక్స్‌యూవీ400 కారును రూ.15 లక్షల్లోపు ధరకే విక్రయించనున్నది. ప్రస్తుతం ఎక్స్‌యూవీ400 ఈవీ కారు సింగిల్ చార్జింగ్‌తో 456 కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది. టాటా మోటార్స్.. టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ మోటార్స్ సారధ్యంలోని ఎంజీ జడ్ఎస్ ఈవీ కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.
మహీంద్రా తన ఎక్స్‌యూవీ400 ఈవీ కారుపై గత రెండు నెలల్లో భారీ డిస్కౌంట్ అందించడం ఇది రెండోసారి. క్యాష్ డిస్కౌంట్ రూపంలోనే ధర తగ్గిస్తోంది. ఈ నెలాఖరు వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ) ఫీచర్ లేని వేరియంట్లకు మాత్రమే డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ కారు రెండు వేరియంట్లు `ఈసీ`, `ఈఎల్` వర్షన్లలో లభిస్తుంది. ఈసీ వేరియంట్ 34.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో సింగిల్ చార్జింగ్ చేస్తే 375 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఇక టాప్ హై ఎండ్ వేరియంట్ ఈఎల్ వర్షన్ 39.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్నది. ఇది సింగిల్ చార్జింగ్‌తో 456 కి.మీ దూరం వెళుతుంది. రెండు వేరియంట్ కార్లలోనూ 7.2 కిలోవాట్ల ఏసీ చార్జర్ ఉంటుంది. ఎంట్రీ లెవల్ ఈసీ వేరియంట్‌లో 3.3 కిలోవాట్ల చార్జర్ ఉంటుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ కారు మోటారు గరిష్టంగ 148 బీహెచ్పీ విద్యుత్, 310 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. కేవలం 8.3 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ విత్ అడ్రెనోఎక్స్‌యూవీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఓటీఏ అప్‌డేట్స్ ఉంటాయి.