Telugu Global
Business

యాత్రా ఎస్బీఐ కార్డుతో బెనిఫిట్స్ బోలెడు.. వెల్‌కం గిఫ్ట్ మొద‌లు ఇలా..

Yatra SBI Credit Card Benefits: కేవ‌లం రూ.499 వార్షిక ఫీజుతో జారీ చేస్తున్న యాత్రా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో ట్రావెల్ బెనిఫిట్ల‌తోపాటు సాధార‌ణంగా సాగే డిపార్ట్‌మెంట‌ల్ స్టోర్స్‌, గ్రాస‌రీ, డైనింగ్‌, మూవీస్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ స్పెండింగ్‌పైనా అసాధార‌ణ‌ ప్ర‌యోజ‌నాలు అందుబాటులో ఉన్నాయి.

Yatra SBI Credit Card Benefits: యాత్రా ఎస్బీఐ కార్డుతో బెనిఫిట్స్ బోలెడు.. వెల్‌కం గిఫ్ట్ మొద‌లు ఇలా..
X

Yatra SBI Credit Card Benefits: యాత్రా ఎస్బీఐ కార్డుతో బెనిఫిట్స్ బోలెడు.. వెల్‌కం గిఫ్ట్ మొద‌లు ఇలా..

విదేశాల్లోనైనా, దేశీయంగానైనా ప్ర‌యాణించేవారైనా, విహార యాత్ర‌ల‌కు వెళ్లేవారికైనా.. అధ్యాత్మిక ప్ర‌దేశాల‌కు వెళ్లేవారికైనా క్రెడిట్ కార్డులు ఉంటే ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. కేవ‌లం రూ.499 వార్షిక ఫీజుతో జారీ చేస్తున్న యాత్రా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో ట్రావెల్ బెనిఫిట్ల‌తోపాటు సాధార‌ణంగా సాగే డిపార్ట్‌మెంట‌ల్ స్టోర్స్‌, గ్రాస‌రీ, డైనింగ్‌, మూవీస్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ స్పెండింగ్‌పైనా అసాధార‌ణ‌ ప్ర‌యోజ‌నాలు అందుబాటులో ఉన్నాయి. యాత్రా డాట్ కామ్‌తో క‌లిసి ఎస్బీఐ జారీ చేస్తున్న ఈ క్రెడిట్ కార్డు బెనిఫిట్లు, ల‌భించే రివార్డు పాయింట్ల గురించి తెలుసుకుందామా..




కొనుగోళ్ల‌కు అనుగుణంగా రివార్డు పాయింట్లు పొందడానికి గొప్ప మార్గం యాత్రా ఎస్బీఐ కార్డ్‌. ఈ కార్డుతో అన్ని ర‌కాల కొనుగోళ్ల‌పైనా వ‌డ్డీ వ‌డ్డింపు ఉండ‌దు. త్వ‌రిత‌గ‌తిన రుణం చెల్లించ‌డానికి వీలు క‌లుగుతుంది. ఇన్సూరెన్స్‌, వ‌డ్డీరేట్లు, రుణాల‌కు సంబంధించి ఎస్బీఐ స‌ర్వీసులు, ప్రొడ‌క్ట్‌లు కూడా ఈ క్రెడిట్ కార్డు సాయంతో పొందొచ్చు.

ఎస్బీఐ యాత్ర కార్డుతో ప‌లు అద‌న‌పు బెనిఫిట్లు ల‌భిస్తున్నాయి. ట్రావెల్ ఇన్సూరెన్స్‌, రోడ్​సైడ్​ అసిస్టెన్స్, కాంప్లిమెంట‌రీ కేర్ స‌ర్వీస్ ల‌భిస్తుంది. ఎస్బీఐ ఆధ్వ‌ర్యంలోని బ్రాండ్లు, కంపెనీల నుంచి స్పెష‌ల్ డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు పొంద‌వ‌చ్చు. వీట‌న్నింటితో వ‌చ్చే రివార్డు పాయింట్ల‌తో మ‌నీ ఆదా చేయ‌వ‌చ్చు. ప్ర‌యాణంలో ఖ‌ర్చులు త‌గ్గించుకోవ‌డానికి ఎస్బీఐ యాత్రా క్రెడిట్ కార్డు అద్భుత‌మైన చాయిస్ అని చెప్ప‌వ‌చ్చు.




దేశీయంగా విమాన ప్ర‌యాణ టికెట్ల కోసం రూ.5000 ఖ‌ర్చు చేస్తే రూ.1000, విదేశీ ప్ర‌యాణం కోసం యాత్రా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో టికెట్‌ బుక్ చేసుకుంటే రూ.40 వేల ఖ‌ర్చుపై రూ.4000 రాయితీ పొందొచ్చు. డొమెస్టిక్ హోట‌ల్ రిజ‌ర్వేష‌న్‌పై రూ.3000 ఖ‌ర్చు చేస్తే 20 శాతం రాయితీ ల‌భిస్తుంది. ఎస్బీఐ యాత్రా మాస్ట‌ర్ కార్డు తీసుకుంటే రూ.8,250 విలువైన వెల్‌కం గిఫ్ట్‌ ఓచ‌ర్ ల‌భిస్తుంది. ప్ర‌తి రూ.100 ఖ‌ర్చుపై ఆరు రివార్డు పాయింట్లు ల‌భిస్తాయి. విమాన ప్ర‌మాదం జ‌రిగితే రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు బీమా క‌వ‌రేజీ ఉంటుంది.

ఎస్బీఐ యాత్రా మాస్ట‌ర్ కార్డ్ క్రెడిట్ కార్డుతో యాత్రా డాట్ కాం రూ.8,250 వెల్‌కం గిఫ్ట్ ఓచ‌ర్‌తోపాటు ప్ర‌తి నెలా ఫ్యుయ‌ల్ స‌ర్ చార్జి రూ.100, ప్ర‌తి రెండు దేశీయ విమాన ప్ర‌యాణాల‌కు రూ.500 విలువైన ఓచ‌ర్‌, ప్ర‌తి రెండు విదేశీ విమాన ప్ర‌యాణాల‌కు రూ.1000 విలువ గ‌ల ఓచ‌ర్‌, హోట‌ల్ బుకింగ్ కోసం రూ.750 ఓచ‌ర్‌, డొమెస్టిక్ వెకేష‌న్ ప్యాకేజీ రూ.1500, విదేశాల‌కు వెకేష‌న్ ప్యాకేజీ రూ.3000తోపాటు డైనింగ్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, గ్రాస‌రీస్‌, డిపార్ట్‌మెంట‌ల్ స్టోర్స్‌, మూవీ టికెట్ల కొనుగోళ్లు చేస్తే ప్ర‌తి రూ.100పై ఆరు రివార్డు పాయింట్లు ల‌భిస్తాయి. ఒక ఏడాదిలో రూ.ల‌క్ష ఖ‌ర్చు చేస్తే ఈ యాత్రా ఎస్బీఐ మాస్ట‌ర్ కార్డ్ క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు మాఫీ అవుతుంది.



క్రెడిట్ కార్డుల వాడ‌కం హాయిగానే ఉంటుంది. ఆ సంతోషం హాయితోపాటు ఫీజులు, చార్జీలు, లేట్ పేమెంట్ చార్జీల వ‌డ్డింపు కూడా ఉంటుంది. జాయినింగ్ ఫీజు లేదా రెన్యూవ‌ల్ ఫీజు రూ.4999 ఉంటుంది. నెల‌వారీ బిల్లుల‌పై 3.35 శాతం లేదా ఏడాదికి 42 శాతం ఫైనాన్స్ చార్జీలు ఉంటాయి. ఈ క్రెడిట్ కార్డుతో ఏటీఎం ద్వారా రూ.500 క్యాష్ విత్‌డ్రా చేసినా 2.5 శాతం క్యాష్ అడ్వాన్స్ ఫీజు పే చేయాలి. పేమెంట్ డిస్‌హాన‌ర్ ఫీజు మొత్తం పేమెంట్‌లో రెండు శాతం, క‌నీసం రూ.450 పే చేయాలి. రెండు నెల‌ల‌కు పైగా లావాదేవీల‌పై స్టేట్‌మెంట్ రిక్వెస్ట్ చేస్తే రూ.1000, క్యాష్ పేమెంట్‌పై రూ.250 చెల్లించాలి.

ఇక ప్ర‌తి నెలా రూ.500 దాటిన బిల్లుపై లేట్ పేమెంట్ చార్జీలు వ‌డ్డిస్తుంది ఎస్బీఐ కార్డు. రూ.500-1000 మ‌ధ్య లేట్ పేమెంట్ అయితే రూ.400, రూ.1,000 నుంచి రూ.10,000 మ‌ధ్య రూ.750, రూ.10,000 నుంచి 25,000 వ‌ర‌కు రూ.950, రూ. 25,000 నుంచి 50,000 వ‌ర‌కు రూ..1,100, రూ.50 వేలు దాటితే రూ.1300 లేట్ పేమెంట్ చేయాలి. చెక్ ద్వారా చెల్లింపులు జ‌రిపితే రూ.100 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ లిమిట్ దాటితే మొత్తం బిల్లుపై 2.5 శాతం లేదా క‌నీసం రూ.600, రివార్డ్స్ రీడిమ్ష‌న్ ఫీజు రూ.99, విదేశీ క‌రెన్సీ లావాదేవీల‌పై 3.5 శాతం చార్జీ పే చేయాల్సి ఉంటుంది.



హైద‌రాబాద్‌తో స‌హా 130 జిల్లాలు, న‌గ‌రాల ప‌రిధిలో జీవిస్తున్న వారంతా ఈ కార్డు పొందేందుకు అర్హులే. స్వయం ఉపాధిపై బ‌తుకుతున్నవారు, వేత‌న జీవులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో ఎంత వేత‌నం అన్న వివ‌రాలు వేత‌న జీవులు తెలియ‌జేయాల్సి ఉంటుంది.

యాత్రా ఎస్బీఐ మాస్ట‌ర్ కార్డ్ క్రెడిట్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్న‌వారు త‌మ గుర్తింపు కార్డుగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవ‌ర్ లైసెన్స్‌, ఓట‌రు గుర్తింపు కార్డు, ఓవ‌ర్సీస్ సిటిజ‌న్ ఆఫ్ ఇండియా కార్డు, ప‌ర్స‌న్ ఆఫ్ ఇండియన్ ఓర్జిన్‌, జాతీయ ఉపాధి ప‌థ‌కం కింద జారీ చేసిన జాబ్ కార్డు స‌మ‌ర్పించాలి. బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ కూడా అంద‌జేయాలి. తాజా ఫామ్‌-16, మూడు నెల‌ల బ్యాంకు స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా ఎస్బీఐ యాత్రా క్రెడిట్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

First Published:  20 Jun 2023 7:27 AM GMT
Next Story