ఈ ఏడాది చివరి ట్రేడింగ్.. నష్టాల్లో మొదలైన సూచీలు
అంతర్జాతీయ బలహీన సంకేతాల మధ్య ఒత్తిడికి లోనవుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెటట్ సూచీలు ఈ ఏడాది చివరి రోజును నష్టాల్లో ప్రారంభించాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాల మధ్య సూచీలు ఒత్తిడికి లోనవుతున్నాయి. దీంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టారు. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ మొదలుపెట్టింది. నిఫ్టీ 23,500 మార్క్ పైన కదలాడుతున్నది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 505.౯౪ పాయింట్ల నష్టంతో 77,742 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 118.15 పాయింట్లు కుంగి 23,526.75 వద్ద కొనసాగుతున్నది. బంగారం ఔన్స్ 2,619.40 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 85.91 వద్ద కొనసాగుతున్నది.
సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, జొమాటో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో కొననసాగుతున్నాయి.