Telugu Global
Business

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు జియో గుడ్ న్యూస్

ఐపీఎల్ సందర్బంగా జియో వినియోదారులకు శుభ వార్త చెప్పింది.

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు జియో గుడ్ న్యూస్
X

ఐపీఎల్ ప్రేక్షకులకు జియో గుడ్ న్యూస్ చెప్పింది. 90 రోజుల పాటు జియో హాట్ స్టార్ స‌బ్‌స్ర్కిప్ష‌న్ ను ఉచితంగా ఇస్తోంది. అయితే.. దీని కోసం ఓ ప‌ని చేయాల్సి ఉంది. కొన్ని ప్ర‌త్యేక ప్లాన్‌ల‌తో రీఛార్జ్ చేసుకున్న వారికి జియో హాట్‌స్టార్ స‌బ్‌స్ర్కిప్ష‌న్ ను ఫ్రీగా ఇస్తున్నారు.– రూ.299 లేదా అంత‌కంటే ఎక్కువ ధ‌ర ఉన్న ప్లాన్‌ల‌తో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ స‌బ్‌స్ర్కిప్ష‌న్ ఉచితం. ఇది కొత‌, పాత వినియోగ‌దారుల‌కు అంద‌రి కోసం.

దీంతో జియో హాట్‌స్టార్ ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ఉచితంగా చూడొచ్చు. మొబైల్ లేదా టీవీలో 4K క్వాలిటీలో మ్యాచ్‌ల‌ను వీక్షించొచ్చు. అంతేకాదండోయ్ అద‌నంగా 50 రోజుల పాటు జియో పైబ‌ర్ సర్వీసులు కూడా ఉచితంగా ల‌భిస్తాయ‌ని జియో ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మార్చి 17 నుంచి ఈనెల 31 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కాగా ఐపీఎల్‌ ప్రసారాల కోసం ఇప్పటికే జియో పలు ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లను ప్రకటించింది. రూ.100 ప్లాన్‌పై 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తోంది. అయితే ఇది కేవలం డేటా ప్లాన్‌ మాత్రమే.మార్చి 22 నుంచి మే 25 వ‌ర‌కు ఐపీఎల్ 18వ సీజ‌న్ జ‌ర‌గ‌నుంది. ఆరంభ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది.

First Published:  17 March 2025 5:15 PM IST
Next Story