Telugu Global
Business

ఈ ఏడాది ఐటీలో ప్లేస్‌మెంట్స్ 40 శాతం తగ్గుతాయ‌ట‌!

ఈసారి ఇండియాలో ఐటీ ప్లేస్‌మెంట్స్ 40 శాతం వ‌రకు త‌గ్గుతాయ‌ని హైరింగ్ కంపెనీలు లెక్క‌లు వేస్తున్నాయి. గత సంవ‌త్స‌రంతో పోల్చితే కొత్త ప్లేస్‌మెంట్స్ ఈసారి 50 వేల నుంచి ల‌క్ష వ‌రకు త‌గ్గ‌వ‌చ్చ‌ని వాటి అంచ‌నా.

ఈ ఏడాది ఐటీలో ప్లేస్‌మెంట్స్ 40 శాతం తగ్గుతాయ‌ట‌!
X

ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీ జాబ్‌లు కొట్టాల‌నుకుంటున్న‌వారికి కాస్త చేదు క‌బురు. ఈసారి ఇండియాలో ఐటీ ప్లేస్‌మెంట్స్ 40 శాతం వ‌రకు త‌గ్గుతాయ‌ని హైరింగ్ కంపెనీలు లెక్క‌లు వేస్తున్నాయి. గత సంవ‌త్స‌రంతో పోల్చితే కొత్త ప్లేస్‌మెంట్స్ ఈసారి 50 వేల నుంచి ల‌క్ష వ‌రకు త‌గ్గ‌వ‌చ్చ‌ని వాటి అంచ‌నా.

ఆ నాలుగు కంపెనీలు నెమ్మ‌దించాయి

ఇండియాలో టాప్‌-5లో ఉన్న టెక్ కంపెనీల్లో నాలుగు(ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌, విప్రో, టెక్ మ‌హీంద్రా) ఈ ఆర్థిక సంవ‌త్స‌రం తొలి మూడు నెల‌లు అంటే ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల్లో ప్లేస్‌మెంట్స్ త‌గ్గించాయి. ఈ నాలుగు కంపెనీలు గ‌త ఏడాదితో పోల్చితే 21,838 ప్లేస్‌మెంట్స్ త‌గ్గించేశాయ‌ని నియామ‌కాల కంపెనీ ఎక్స్‌ఫీనో ప్ర‌క‌టించింది. ఈ లెక్క‌న ఈ ఏడాది మొత్తంలో ల‌క్ష వ‌ర‌కు కొత్త ప్లేస్‌మెంట్స్ త‌గ్గొచ్చ‌ని అంచ‌నా వేసింది. ఒక్క టీసీఎస్ మాత్ర‌మే 500 మందిని ఎక్కువ‌గా తీసుకుంది.

ఏటా 2.50 ల‌క్ష‌ల ఉద్యోగాలు

ఇండియాలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏటా రెండున్న‌ర ల‌క్ష‌ల ఉద్యోగాలిస్తున్నాయి. తొలి మూడు నెల‌ల మాదిరిగానే ప‌రిస్థితి ఉంటే ఈ ఏడాది ప్లేస్‌మెంట్లు 40 శాతం త‌గ్గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంద‌ని టీమ్ లీజ్ డిజిట‌ల్ పేర్కొంది. ఒక‌రకంగా చెప్పాలంటే ఇది వాష్ అవుట్ ఇయ‌ర్ అని ఆ సంస్థ సీఈవో కామెంట్ చేశారు.

First Published:  11 Aug 2023 12:05 PM IST
Next Story