Telugu Global
Business

Apple- iPhone 15 Series | టెక్ ప్రియుల‌పై ఆపిల్ డిస్కౌంట్‌ల వ‌ర్షం.. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌.. ఇవీ డిటైల్స్‌.. !

ఆపిల్ త‌న తాజా ఐఫోన్‌15 సిరీస్ ఫోన్ల‌ను ఈ నెల 12న కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో నిర్వ‌హించిన `వండ‌ర్‌ల‌స్ట్‌` ఈవెంట్‌లో అట్ట‌హాసంగా ఆవిష్క‌రించింది. టైటానియంతో నిర్మించిన ఈ ఫోన్‌తో తొలిసారి యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ చార్జ‌ర్ అందిస్తోంది.

Apple- iPhone 15 Series | టెక్ ప్రియుల‌పై ఆపిల్ డిస్కౌంట్‌ల వ‌ర్షం.. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌.. ఇవీ డిటైల్స్‌.. !
X

Apple- iPhone 15 Series | స్మార్ట్ ఫోన్ ప్రియుల‌కు గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జం ఆపిల్ (Apple) గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెల 12న కాలిఫోర్నియాలో ఆపిల్ పార్క్‌లో `వండ‌ర్‌ల‌స్ట్‌` ఈవెంట్‌లో ఆవిష్క‌రించిన‌ ఐ-ఫోన్ 15 సిరీస్ (iPhone 15 Series) ఫోన్ల సేల్స్ శుక్ర‌వారం (సెప్టెంబ‌ర్ 22) నుంచి ప్రారంభం అవుతాయి. మీరు తాజా ఐ-ఫోన్15 సిరీస్ ఫోన్లు కొనుక్కోవాల‌ని భావిస్తున్నారా..? కొంత తీపి క‌బురందించింది ఆపిల్‌.

ఐఫోన్ 15 (iPhone 15), ఐఫోన్ 15 ప్ల‌స్ (iPhone 15 Plus), ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max), ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 series) ఫోన్ల‌పై బ్యాంక్ బేస్డ్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫ‌ర్ అందిస్తోంది. ఐ-ఫోన్ 13 (iPhone 13), ఆపిల్ వాచ్ సిరీస్ 9 (Apple Watch Series 9), ఆపిల్ వాచ్ ఆల్ట్రా 2 (Apple Watch Ultra 2), ఆపిల్ వాచ్ ఎస్ఈ (Apple Watch SE)ల‌పైనా ఈ ఆఫ‌ర్ ల‌భిస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) క్రెడిట్ కార్డులు, వాటితో ఈఎంఐ ఆప్ష‌న్ల‌తో కొనుగోలు చేసే వారికి ఐ-ఫోన్ 15 (iPhone15) సిరీస్ పోన్ల‌పై రూ.6000 వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఫోన్ల‌పై రూ.6000, రెగ్యుల‌ర్ ఐఫోన్‌15 (iPhone 15), ఐఫోన్ 15 ప్ల‌స్ (iPhone 15 Plus) ఫోన్ల‌పై రూ.5000 వ‌ర‌కూ డిస్కౌంట్ అందిస్తోంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌. ఇక 2022 మోడ‌ల్ ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14) ఫోన్ల‌పై రూ.4000, 2021 మోడ‌ల్ ఐఫోన్ 13 సిరీస్ (iPhone 13) ఫోన్ల‌పై రూ.3000 రాయితీ ల‌భిస్తుంది.

ఐ-ఫోన్ 15 (iPhone 15) ఫోన్ అస‌లు ధ‌ర రూ.79,900 కాగా, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.74,900, ఐ-ఫోన్15 ప్ల‌స్ (iPhone 15 Plus) ఫోన్ ధ‌ర రూ.89,900 కాగా, రూ.84,900ల‌కు ల‌భిస్తుంది.

ఐఫోన్ 15 ప్రో బేస్ (iPhone 15 Pro) వేరియంట్ ఫోన్ ధ‌ర‌ రూ.1,34,900 (ఎక్స్‌షోరూమ్‌) కాగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారుల‌కు రూ. 1,28,900ల‌కు ల‌భిస్తుంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఫోన్ రూ.1,59,900 కాగా, రూ.1,53,900ల‌కే సొంతం చేసుకోవ‌చ్చు.

ఆపిల్ వాచ్ సిరీస్ 9 (Apple Watch Series 9) వాస్త‌వ ధ‌ర రూ.41,900 నుంచి రూ.39,400కు, ఆపిల్ వాచ్ ఆల్ట్రా 2 (Apple Watch Ultra 2) ధ‌ర రూ.89,900 కాగా, రూ.86,900ల‌కు సొంతం చేసుకోవ‌చ్చు. సెకండ్ జ‌న‌రేష‌న్ ఆపిల్ వాచ్ ఎస్ఈ ధ‌ర‌ రూ.29,900 ప‌లుకుతుండ‌గా, రూ.1500 డిస్కౌంట్‌తో రూ.28,400ల‌కే ల‌భిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారుల‌కు ఐఫోన్‌14 ఫోన్ రూ.69,900 నుంచి రూ.65,900ల‌కు, ఐఫోన్ ప్ల‌స్ రూ.79,900 నుంచి రూ.75,900ల‌కు ల‌భిస్తాయి. ఐ-ఫోన్ 13 ఫోన్ రూ.59,900 నుంచి రూ.56,900, ఐ-ఫోన్ ఎస్

ఈ రూ.49,900 నుంచి రూ.47,900ల‌కు ల‌భిస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారుల‌కు పేమెంట్ ఆధారిత డిస్కౌంట్ ల‌భిస్తుంది. భార‌త్ క‌స్ట‌మ‌ర్‌లు ఆపిల్ ఇండియా వెబ్‌సైట్‌, ఢిల్లీలోని ఆపిల్ సాకేత్‌, ముంబైలోని ఆపిల్ బీకేసీ షోరూమ్‌ల నుంచి కొనుగోలు చేయొచ్చు.

ఆపిల్ త‌న తాజా ఐఫోన్‌15 సిరీస్ ఫోన్ల‌ను ఈ నెల 12న కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో నిర్వ‌హించిన `వండ‌ర్‌ల‌స్ట్‌` ఈవెంట్‌లో అట్ట‌హాసంగా ఆవిష్క‌రించింది. టైటానియంతో నిర్మించిన ఈ ఫోన్‌తో తొలిసారి యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ చార్జ‌ర్ అందిస్తోంది. ఐఫోన్ 15 మోడ‌ల్ ఫోన్లు ఏ16 బ‌యోనిక్ చిప్‌, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఏ17 ప్రో చిప్‌తో వ‌స్తున్నాయి.


First Published:  21 Sept 2023 8:41 AM IST
Next Story