లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు
మంగళవారం బెంచ్‌మార్క్ తో లాభాల్లో ట్రేడవుతున్నఇండియన్ ఈక్విటీ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం మందకొడిగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లతో మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మొదట ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 335.39 పాయింట్లు లాభపడి 81,487 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 24,878 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.10 వద్ద ఉన్నది. బంగారం ఔన్సు 2,747.10 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) తమ నిధులను దేశీయ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటూనే ఉన్నారు. ఎఫ్‌ఐఐలు సోమవారం నికరంగా రూ. 2,261.83 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా 3,225.91 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.