Telugu Global
Business

స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య శుక్రవారం ప్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ప్లాట్‌గా మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 8 పాయింట్లు పెరిగి 84,842 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 26,222 వద్ద ట్రేడవుతున్నది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్‌, సన్‌ఫార్మా, టీసీఎస్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎల్‌ అండ్‌ టీ, భారతీ ఎయిర్‌ టెల్‌, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలో ట్రేడవుతున్నాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.63 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 71.41 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,694.40 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగియగా.. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలూ అదే బాటలో పయనిస్తున్నాయి.

First Published:  27 Sept 2024 4:33 AM GMT
Next Story