Telugu Global
Business

నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు

సెన్సెక్స్‌ 450 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 24,200 దిగువన ట్రేడవుతున్నది.

నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ప్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల మధ్య ప్లాట్‌గా ప్రారంభమైన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్‌ 450 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 24,200 దిగువన ట్రేడవుతున్నది. ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 450 పాయింట్లు కుంగి 79,600 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 125.85 పాయింట్లు తగ్గి 24,259 వద్ద కొనసాగుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.08 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్ల బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 71.56 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,764.80 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్‌, టెక్‌ మమీంద్రా, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్టీపీసీ, ఐసీఐసీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌ టీ, నెస్లే ఇండియా షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగియగా.. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో నడుస్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ. 3,228.08 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ. 1,400.85 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

First Published:  29 Oct 2024 10:52 AM IST
Next Story