Telugu Global
Business

నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు

భారీగా పెరిగిన బంగారం ధర..తొలిసారి 2700 డాలర్లకు చేరుకున్న పసిడి ఔన్స్‌

నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో మొదలయ్యాయి. విదేశీ మదుపర్ల నిధుల ఉపసంహరణ కొనసాగుతుండటం, ఇప్పటికే వెలువడిన త్రైమాసిక ఫలితాలను కూడా మెప్పించకపోవడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెక్సెస్‌ 444 పాయింట్ల కుంగి 80,561 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 130 పాయింట్లు తగ్గి 24,625 వద్ద కొనసాగుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 74.49 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. మొదటిసారి బంగారం ధర భారీగా పెరిగింది. బంగారం ఔన్స్‌ 2,722 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, టైటాన్‌, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, ఐటీసీ, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్‌ ఈ నాలుగు షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి.

First Published:  18 Oct 2024 5:41 AM GMT
Next Story