Telugu Global
Business

ఫ్లాట్‌గా ప్రారంభమై.. లాభాల్లోకి వెళ్లిన సూచీలు

అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్న మదుపర్లు

ఫ్లాట్‌గా ప్రారంభమై.. లాభాల్లోకి వెళ్లిన సూచీలు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు కాసేపు లాభ-నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. మొదట సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ ప్రధాన షేర్ల అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 187.18 పాయింట్ల లాభంతో 74527.27 వద్ద.. నిఫ్టీ 40.20 పాయింట్టు పెరిగి 22584.90 వద్ద ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.14 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 69.04 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2 911.40 డాలర్ల వద్ద కదలాడుతున్నది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్‌, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌అండ్‌టీ, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.

First Published:  7 March 2025 10:47 AM IST
Next Story