మరోసారి నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
23 వేల పాయింట్ల దిగువకు నిఫ్టీ
BY Naveen Kamera14 Feb 2025 4:29 PM IST

X
Naveen Kamera Updated On: 14 Feb 2025 4:29 PM IST
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం ఉదయం నుంచి సూచీలు అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడింగ్ శుక్రవారం ఉదయం 76,388.99 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైనా కొద్దిసేపటికే నష్టాల్లోకి కూరుకుపోయింది. రోజంతా ట్రేడింగ్ నష్టాల బాటలోనే సాగింది. చివరికి 199 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 75,939.21 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 102.15 పాయింట్లు కోల్పోయి 23 వేల పాయింట్ల దిగువకు జారిపోయింది. నిఫ్టీ ట్రేడింగ్ 22,929.25 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచంలోని మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రభావంతో భారతీయ మార్కెట్లు పెను నష్టాల్లోకి కూరుకుపోయాయి.
Next Story