Telugu Global
Business

ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు

అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య అప్రమత్తత పాటిస్తున్న దేశీయ సూచీలు

ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు
X

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ సూచీలు అప్రమత్తత పాటిస్తున్నాయి. దీంతో మంగళవారం సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 83 పాయింట్ల లాభంతో 81,133 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 24,808 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 7పైసలు పెరిగి 83.93గా కొనసాగుతున్నది. అంతర్జాతీయ విపణలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 79.76 డాలర్లపైనే ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,661.50 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, పవర్‌గ్రిడ్‌, టైటాన్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) క్రమంగా తమ పెట్టుబడులును పెద్దమొత్తంలో వెనక్కి తీసుకుంటున్నారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ఎఫ్‌ఐఐలు వరుసగా ఆరో రోజు సోమవారం నికరంగా రూ. 8,292 కోట్ల షేర్లను విక్రయించగా డీఐఐలు నికరంగా రూ. 13,245 షేర్లను కొనుగోలు చేశారు.

First Published:  8 Oct 2024 10:01 AM IST
Next Story