Telugu Global
Business

IIT-Bombay Placements | మైండ్ బ్లోయింగ్ ఆఫ‌ర్‌.. ఏడాదికి రూ.3.7 కోట్ల వేత‌న ప్యాకేజీ.. ఐఐటీ-బాంబే ప్లేస్‌మెంట్స్‌..!

IIT-Bombay Placements | ఐఐటీ-బాంబేలో ఇటీవ‌ల నిర్వ‌హించిన క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్‌లో ఒక గ్రాడ్యుయేట్‌కి ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ఏడాదికి రూ.3.7 కోట్ల వేత‌న ప్యాకేజీ అందించింది.

IIT-Bombay Placements | మైండ్ బ్లోయింగ్ ఆఫ‌ర్‌.. ఏడాదికి రూ.3.7 కోట్ల వేత‌న ప్యాకేజీ.. ఐఐటీ-బాంబే ప్లేస్‌మెంట్స్‌..!
X

IIT-Bombay Placements | ఐఐటీ-బాంబేలో ఇటీవ‌ల నిర్వ‌హించిన క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్‌లో ఒక గ్రాడ్యుయేట్‌కి ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ఏడాదికి రూ.3.7 కోట్ల వేత‌న ప్యాకేజీ అందించింది. దేశీయ సంస్థ మ‌రో గ్రాడ్యుయేట్‌కి గ‌రిష్టంగా రూ.1.7 కోట్ల వేతన ప్యాకేజీ ఆఫ‌ర్ చేసింది. గ‌తేడాది ప్లేస్‌మెంట్ డ్రైవ్‌తో పోలిస్తే అంత‌ర్జాతీయ సంస్థ నుంచి గ‌ణ‌నీయంగా ఎక్కువ వేత‌న ప్యాకేజీ ల‌భిస్తే, దేశీయ సంస్థ స్వ‌ల్పంగా త‌క్కువ ప్యాకేజీ ఆఫ‌ర్ అందించింది.

ఈ ఏడాది 16 మంది గ్రాడ్యుయేట్ల‌కు రూ.కోటికి పైగా వేత‌న ప్యాకేజీతో కూడిన ఆఫ‌ర్లు ల‌భించాయి. 300 మంది విద్యార్థుల‌కు ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫ‌ర్లు ల‌భించాయి.. 65 ఇంట‌ర్నేష‌న‌ల్ ఆఫ‌ర్ల‌తోపాటు 194 మంది విద్యార్థులు త‌మ‌కు వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను అప్రూవ్ చేసేశారు. 2021-22తో పోలిస్తే ఇంట‌ర్నేష‌న‌ల్ ప్లేస్ మెంట్స్ త‌క్కువ‌. ఉక్రెయిన్-ర‌ష్యా మధ్య సాగుతున్న యుద్ధం వ‌ల్ల త‌లెత్తిన అనిశ్చిత ప‌రిస్థితుల వ‌ల్లే ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌ల ప్లేస్‌మెంట్స్ ఎక్కువ‌గా జ‌రుగ‌లేద‌ని తెలుస్తున్న‌ది. అయినా, అమెరికా, జ‌పాన్‌, బ్రిట‌న్‌, నెద‌ర్లాండ్స్‌, హాంకాంగ్, తైవాన్ సంస్థ‌లు విద్యార్థుల‌కు ప్రీ-ఆఫ‌ర్లు ఇవ్వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

గ‌తేడాదితో పోలిస్తే ఇంజినీరింగ్‌, టెక్నాల‌జీ సెక్టార్లలో అత్య‌ధిక విద్యార్థుల నియామ‌కాలు జ‌రిగాయి. ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగ ప‌రిశ్ర‌మ‌ల్లో నియామ‌కాలు త‌క్కువ‌గా ఉన్నాయి. 2020-21,2021-22ల‌తో పోలిస్తే ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రం (2022-23)లోనే కాస్త ఎక్కువ వేత‌న ప్యాకేజీతో ఆఫ‌ర్లు ల‌భించాయి. 2020-21లో స‌రాస‌రి రూ.17.9 లక్ష‌లు, 2021-22లో రూ.21.5 ల‌క్ష‌ల వేత‌న ప్యాకేజీ ల‌భిస్తే, ప్ర‌స్తుతం స‌గటున రూ.21.8 ల‌క్ష‌ల వేత‌న ప్యాకేజీ ఆఫ‌ర్ చేశాయి ఆయా కార్పొరేట్ సంస్థ‌లు. మొత్తం 97 కంపెనీలు ఎంట్రీ లెవ‌ల్ జాబ్స్ కోసం 458 మంది విద్యార్థుల‌కు ఆఫ‌ర్ లెట‌ర్లు అంద‌జేశాయి.

బీటెక్‌, డ్యుయ‌ల్ డిగ్రీ, ఎంటెక్ విద్యార్థుల్లో ప్లేస్‌మెంట్స్ డ్రైవ్‌లో పాల్గొన్న వారిలో సుమారు 90% మంది ఉద్యోగాల ఆఫ‌ర్లు అందుకున్నారు. 1845 మంది పాల్గొంటే 1516 మంది విద్యార్థులు (82 శాతం) కొలువులు పొందారు. ఇక పీహెచ్‌డీ విద్యార్థుల‌లో కేవ‌లం 31 శాతం మందికి మాత్ర‌మే ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫ‌ర్లు ల‌భించాయి.

First Published:  10 Sept 2023 5:33 PM IST
Next Story