Hyundai Creta Facelift | హ్యుండాయ్ `శిఖ`లో మరో మైలురాయి.. ఆరు నెలల్లోనే లక్ష యూనిట్ల సేల్స్..
Hyundai Creta Facelift | హ్యుండాయ్ (Hyundai) గత జనవరిలో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన మిడ్‌సైజ్ ఎస్‌యూవీ కారు.. 2024-హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ (2024 Hyundai Creta facelift) కేవలం ఆరు నెలల్లోనే లక్ష యూనిట్లు విక్రయించారు.
Hyundai Creta Facelift | హ్యుండాయ్ మోటార్ ఇండియా స్వల్ప కాలంలో కీలక మైలురాయిని దాటేసింది. హ్యుండాయ్ (Hyundai) గత జనవరిలో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన మిడ్‌సైజ్ ఎస్‌యూవీ కారు.. 2024-హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ (2024 Hyundai Creta facelift) కేవలం ఆరు నెలల్లోనే లక్ష యూనిట్లు విక్రయించారు. గత జనవరిలో మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి రోజూ హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారు 550 యూనిట్లు విక్రయించింది. తొలిసారి 2015లో క్రెటా కారును హ్యుండాయ్ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. 2015 నుంచి ఇప్పటి వరకూ 10 లక్షలకు పైగా హ్యుండాయ్ క్రెటా కార్లు అమ్ముడయ్యాయి.
మోడ్రన్ టెక్నాలజీ, ధృడమైన సేఫ్టీ నెట్‌వర్క్, మల్టీపుల్ ఇంజిన్ గేర్‌బాక్స్ ఆప్షన్లు, స్పేసియస్ ఇంటీరియర్ డిజైన్లతో క్రెటా ఫేస్‌లిఫ్ట్ (2024 Hyundai Creta facelift) కస్టమర్లను ఆకర్షించింది. తద్వారా దేశీయ కార్ల మార్కెట్‌లో అత్యంత పాపులర్ ఎస్‌యూవీగా హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ (2024 Hyundai Creta facelift) నిలిచింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్ వంటి కార్లతోపాటు వచ్చేవారంలో మార్కెట్లోకి రానున్న టాటా కర్వ్ ఎస్‌యూవీ కూపే కార్లకు మార్కెట్‌లో గట్టి పోటీ ఇవ్వనున్నదని తెలుస్తోంది.
హ్యుండాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ (2024 Hyundai Creta facelift) ధృడమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది. లెవెల్-2 అడ్వాన్స్‌డ్ అడాస్ (ADAS) సేఫ్టీ ఫీచర్లు, సమర్థవంతమైన 1.5 లీటర్ల టర్బో జీడీఐ ఇంజిన్, ప్రయాణికులకు సౌకర్యవంతంగా యాక్టివ్ అండ్ పాసివ్ సేఫ్టీ ఫీచర్లతో వచ్చింది. భారత్ మార్కెట్‌లో ఎస్‌యూవీ ల్యాండ్ స్కేప్ రీ డిఫైన్ చేసింది. పనోరమిక్ సన్‌రూఫ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్, 10.25 - అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ వ్యూ కెమెరా తదితర ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. 2024-హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ (2024 Hyundai Creta facelift) కారు పూర్తిగా సుపీరియర్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్, ఇన్నోవేటివ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్నది.
హ్యుండాయ్ క్రెటా మూడు ఇంజిన్ ఆప్షన్లు - 1.5-లీటర్ల ఎంపీఐ పెట్రోల్ (115 పీఎస్ విద్యుత్ అండ్ 144ఎన్ఎం టార్క్), 1.5-లీటర్ల కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ (160 పీఎస్ విద్యుత్ అండ్ 253 ఎన్ఎం టార్క్), 1.5-లీటర్ల యూ2 సీఆర్డీఐ డీజిల్ (116 పీఎస్ విద్యుత్ అండ్ 250 ఎన్ఎం టార్క్) ఇంజిన్లతో వస్తోంది. ఎంపీఐ యూనిట్ కారు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఐవీటీ ఆటోమేటిక్, టర్బో జీడీఐ యూనిట్ విత్ 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్, సీఆర్‌డీఐ యూనిట్ విత్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 2024-క్రెటా ఫేస్‌లిఫ్ట్‌కు కొనసాగింపుగా హ్యుండాయ్ `క్రెటా ఎన్ లైన్`ను గత మార్చిలో ఆవిష్కరించింది. హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ కారు 1.5 లీటర్ల కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ (160 పీఎస్ విద్యుత్, 252 ఎన్ఎం టార్క్) విత్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ డీసీటీ ఆప్షన్లలో లభిస్తుంది.
2024-హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారు గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్ `సెన్సూయస్ స్పోర్టీనెస్`తో వస్తోంది. క్వాడ్ బీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, బ్లాక్ క్రోమ్ పారా మెట్రిక్ రేడియేటర్ గ్రిల్లె, సిగ్నేచర్ హరిజోన్ ఎల్ఈడీ పొజిషనింగ్ లైట్స్, డీఆర్ఎల్స్, ఎయిరో డైనమిక్ స్పాయిలర్, రీవాంప్డ్ టెయిల్ గేట్, న్యూ కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఫీచర్లతో వస్తోంది. ఎక్స్‌టీరియర్‌గా సిక్స్ మోనోటోన్, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఫైరీ రెడ్, రేంజర్ కాకీ, రోబస్ట్ ఎమరాల్ట్ పెరల్, టైటాన్ గ్రే, అబ్యాస్ బ్లాక్, అట్లాస్ వైట్, అట్లాస్ వైట్ విత్ బ్లాక్ రూఫ్ (డ్యుయల్ టోన్) రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ కారు 17- అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది.
2024 హ్యుండాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ ఏడు ప్రైమరీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ, ఈఎక్స్, ఎస్, ఎస్ (ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ టెక్, ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లలో అందుబాటులో ఉంది. కారు 4,330 ఎంఎం పొడవు, 1,790 ఎంఎం వెడల్పు, 1,635 ఎంఎం ఎత్తుతోపాటు 2610 ఎంఎం వీల్ బేస్ కలిగి ఉంటుంది. హ్యుండాయ్ క్రెటా కారు ధర రూ.11 లక్షల నుంచి రూ.20.15 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య అందుబాటులో ఉండగా, హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ కారు ధర రూ.16.82 లక్షల నుంచి రూ.20.45 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతోంది.