Telugu Global
Business

ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే..

జాబ్ ఇంటర్వ్యూలో నెగ్గాలంటే మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు సరైన బాడీ లాంగ్వేజ్‌ను మెయింటెయిన్ చేయడం కూడా ముఖ్యం.

ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే..
X

జాబ్ ఇంటర్వ్యూలో నెగ్గాలంటే మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు సరైన బాడీ లాంగ్వేజ్‌ను మెయింటెయిన్ చేయడం కూడా ముఖ్యం. అసలు బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? దాన్నెలా సరిచేసుకోవాలి?

బాడీ లాంగ్వేజ్ అనేది మీ గురించి చాలా విషయాలను చెప్పకనే చెప్తుంది. ఇంటర్వ్యూ చేసేవాళ్లు మీ నాలెడ్జితో పాటు మీ ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌ను కూడా అంచనా వేస్తారు. అందులో బాడీ లాంగ్వేజ్ అనేది కీలకమైన విషయం. కళ్లతో చూసే విధానం, నడక, కూర్చునే తీరు.. ఇలాంటివన్నీ బాడీ లాంగ్వేజ్ కిందకు వస్తాయి. ఇంటర్వ్యూలో అవతలివాళ్లను ఇంప్రెస్ చేసేందుకు బాడీ లాంగ్వేజ్ చక్కగా పనికొస్తుంది. బాడీ లాంగ్వేజ్‌ను డెవలప్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

పలకరింపు

ఇంటర్వ్యూ గదిలోకి రాగానే చిరునవ్వుతో పలకరించడం, వెళ్లేముందు చిరునవ్వుతో థాంక్యూ చెప్పడం అనేది సరైన పలకరింపుగా ఉంటుంది. అవసరమైతే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వొచ్చు. అలాగే తలుపు తెరవడం, కూర్చీలో కూర్చోవడం వంటి విషయాల్లో కూడా మీ ప్రశాంతత కనిపించాలి.

కూర్చునే తీరు

సైకాలజీ ప్రకారం మీరు కూర్చునే తీరు మీ కాన్ఫిడెన్స్‌ను ప్రతిబింబిస్తుంది. కాబట్టి తిన్నగా, నిటారుగా కూర్చోవాలి. కాళ్లను దగ్గరగా పెట్టుకుని, భుజాలను రిలాక్స్‌డ్‌గా ఉంచుకోవాలి. సందర్భాన్ని బట్టి మెల్లగా తల ఆడించాలి. కాళ్లు ఊపడం, వెనక్కి వాలిపోవడం వంటివి చేయకూడదు.

చిరునవ్వు

ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేలా చూసుకోవాలి. చిరునవ్వుని మెయింటెయిన్ చేయడం ద్వారా మీ కాన్ఫిడెన్స్ పెరగడంతోపాటు అక్కడి వాతావరణం కూడా పాజిటివ్‌గా మారుతుంది. ఇంటర్వ్యూవర్‌‌కు మీపై మంచి ఇంప్రెషన్ కలుగుతుంది.

శ్రద్ధగా వినాలి.

ఇంటర్వ్యూలో ఎదుటివాళ్లు అడిగేది శ్రద్ధగా వినాలి. పూర్తిగా విన్న తర్వాతే జవాబు చెప్పాలి. అలాకాకుండా ప్రశ్న పూర్తవ్వకముందే జవాబు చెప్పాలనుకోవడం, మధ్యలో కలుగజేసుకోవడం వంటివి బ్యాడ్ కమ్యూనికేషన్ కిందకు వస్తాయి. కాబట్టి పూర్తిగా విన్న తర్వాతే మీ సమాధానాన్ని చెప్పాలి.

ఐ కాంటాక్ట్

బాడీ లాంగ్వేజ్‌లో ఐ కాంటాక్ట్ అనేది ముఖ్యమైన విషయం. ఎదురుగా ఉన్నవాళ్లతో ఎప్పుడూ సరైన ఐ కాంటాక్ట్ మెయింటెయిన్ చేస్తుండాలి. నేరుగా కళ్లలోకి చూస్తూ మాట్లాడడం అనేది మీపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. అలాకాకుండా మాట్లాడేటప్పుడు ఎక్కడెక్కడో చూస్తుంటే మీరు చెప్పేదానిపై మీకు క్లారిటీ లేదని అనిపిస్తుంది.

మెరుగైన బాడీ లాంగ్వేజ్‌తో తెలియకుండానే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దీన్ని మెరుగుపరచుకోవడం కోసం నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. ఆన్‌లైన్ వీడియోల ద్వారా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్‌తో కలిసి ప్రాక్టీస్ చేయొచ్చు.

First Published:  16 Dec 2023 12:26 PM IST
Next Story