Honda XL750 Transalp | మార్కెట్‌లోకి హోండా ఎక్స్ఎల్ 750 ట్రాన్సాల్ప్.. లిమిటెడ్ ఆఫర్ ఓన్లీ..!
Honda XL750 Transalp | దేశంలోని ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత్ మార్కెట్లోకి ఎక్స్ఎల్ 750 ట్రాన్సాల్ప్ (Honda XL750 Transalp) ఆవిష్కరించింది. దీని ధర రూ.10,99,990 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
Honda XL750 Transalp | దేశంలోని ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత్ మార్కెట్లోకి ఎక్స్ఎల్ 750 ట్రాన్సాల్ప్ (Honda XL750 Transalp) ఆవిష్కరించింది. దీని ధర రూ.10,99,990 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ మోటార్ సైకిల్ బింగ్ వింగ్ టాప్ లైన్ (BigWing Top Line) డీలర్‌షిప్‌ల్లో విక్రయిస్తుంది. సీబీయూ రూట్‌లో ఎక్స్ఎల్ 750 ట్రాన్సాల్ప్ (XL750 Transalp) విక్రయిస్తుంది. అంతే కాదు భారత్ మార్కెట్‌లోకి 100 యూనిట్లు మాత్రమే తీసుకొస్తుంది. వచ్చేనెలలో ఎక్స్ఎల్ 750 ట్రాన్సాల్ప్ (Honda XL750 Transalp) డెలివరీ ప్రారంభం అవుతుంది. హోండా ఎక్స్ఎల్ 750 ట్రాన్సాల్ప్ రెండు కలర్స్- రోజ్ వైట్, మ్యాట్టె బాలిస్టిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
హోండా ఎక్స్ఎల్750 ట్రాన్సాల్ప్ (Honda XL750 Transalp) మోటారు సైకిల్ 755సీసీ లిక్విడ్ కూల్డ్, పార్లల్ ట్విన్ ఇంజిన్ విత్ గేర్ బ్యాక్స్, 270-డిగ్రీ క్రాంక్‌తో లిక్విడ్ కూల్డ్ కలిగి ఉంటుంది. హోండా ఎక్స్ఎల్ 750 ట్రాన్సాల్ప్ ఇంజిన్ గరిష్టంగా 90.51 బీహెచ్పీ విద్యుత్, 75 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
హోండా ఎక్స్ఎల్ 750 ట్రాన్సాల్ప్ మోటారు సైకిల్ థ్రోటిల్ బై వైర్, ఫైవ్ రైడింగ్ మోడ్స్ - స్పోర్ట్, స్టాండర్డ్, రెయిన్, గ్రావెల్, యూజర్ మోడ్స్‌లో లభిస్తుంది. ఈ మోటార్ సైకిల్ రైడింగ్ మోడ్స్ ఇంజిన్ పవర్, ఇంజిన్ బ్రేకింగ్, హోండా టార్క్ కంట్రోల్ (హెచ్ఎస్‌టీసీ) విత్ ఏబీఎస్, అసిస్ట్ స్లిప్పర్ క్లచ్‌తో వస్తుంది. యూజర్ మోడ్‌లో రైడర్ తనకు నచ్చినట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు.
హోండా ఎక్స్ఎల్ 750 ట్రాన్సాల్ప్ (Honda XL750 Transalp) మోటారు సైకిల్ 5-అంగుళాల టీఎఫ్‌టీ ప్యానెల్ కలిగి ఉంటుంది. స్పీడో మీటర్, టాచో మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఫ్యుయల్ గేజ్ అండ్ కంజప్షన్, రైడింగ్ మోడ్స్, ఇంజిన్ పారా మీటర్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండిల్ బార్ మీద స్విచ్ గేర్ ద్వారా ఇంజిన్ కంట్రోల్ చేస్తారు.
షోవా 43ఎంఎం అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్ ఎట్ ది రేర్, అప్ ఫ్రంట్ రెండు పిస్టన్ కాలిపర్స్, డ్యుయల్ చానెల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కలిగి ఉంటుంది. హోండా ఎక్స్ఎల్ 750 ట్రాన్సాల్ప్ మోటారు సైకిల్.. హోండా స్మార్ట్ ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ (Honda Smartphone Voice Control system -HSVCs) కలిగి ఉంటుంది. దీంతో ఆ మోటారుసైకిల్‌పై ప్రయాణించే వారు కాల్స్ వాయిస్ మేనేజ్మెంట్, మెసేజెస్, మ్యూజిక్, నేవిగేషన్స్‌తో నియంత్రించవచ్చు. ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫీచర్ ఉంటుంది. దీంతో ఆటోమేటిక్‌గా నిలిచిపోతుంది.