Telugu Global
Business

Honda New Sports Bike | హోండా నుంచి కొత్త స్పోర్ట్స్ బైక్‌.. ఆ నాలుగు మోటారు సైకిళ్ల‌తో సై అంటే సై

Honda New Sports Bike | హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూట‌ర్స్‌.. మార్కెట్లోకి బుధ‌వారం కొత్త స్పోర్ట్స్ బైక్ తీసుకురానున్న‌ది. 160-180 సీసీ సెగ్మెంట్‌లో హీరో, బ‌జాజ్‌, టీవీఎస్‌, య‌మ‌హా మోటారు సైకిళ్ల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది.

Honda New Sports Bike | హోండా నుంచి కొత్త స్పోర్ట్స్ బైక్‌.. ఆ నాలుగు మోటారు సైకిళ్ల‌తో సై అంటే సై
X

Honda New Sports Bike | హోండా నుంచి కొత్త స్పోర్ట్స్ బైక్‌.. ఆ నాలుగు మోటారు సైకిళ్ల‌తో సై అంటే సై

Honda New Sports Bike | దేశీయ టూవీల‌ర్స్ త‌యారీ కంపెనీల్లో హీరో మోటో కార్ప్‌.. హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూట‌ర్స్ ఇండియా, బ‌జాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ ప్ర‌ధాన సంస్థ‌లు.. హీరో మోటో కార్ప్ త‌ర్వాతీ స్థానంలో ఉన్న హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూట‌ర్స్ ఇండియా... బ‌జాజ్ ప‌ల్స‌ర్ ఎన్‌160, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ, య‌మ‌హా ఎఫ్‌జ‌డ్‌-ఎఫ్ఐ, హీరో ఎక్స్‌ట్రీమ‌మ్ 160 ఆర్ 4వీ బైక్‌ల‌తో పోటీ ప‌డేందుకు స్పోర్ట్స్ బైక్ తీసుకొస్తున్న‌ది. బుధ‌వారం దేశీయ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. ఈ బైక్‌ 160-180 సీసీ ఇంజిన్ సెగ్మెంట్‌లో వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

160సీసీ సెగ్మెంట్‌లో సేల్స్ మెరుగ్గా ఉన్నా యూనికార్న్‌తో పోలిస్తే ఎక్స్ బ్లేడ్ అంత‌గా మోటారు సైకిళ్ల ప్రేమికుల‌ను ఆక‌ర్షించ‌లేక‌పోయింది. ఈ నేప‌థ్యంలోనే 160 సీసీ సెగ్మెంట్‌లో మ‌రో మోటారు సైకిల్ తేవాల‌ని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూట‌ర్స్ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తున్న‌ది.

సక్సెస్‌ఫుల్ బైక్‌గా పేరొందిన యూనికార్న్‌ ఇంజిన్‌తో కొత్త హోండా మోటార్ సైకిల్ వస్తుందని స‌మాచారం. హోండా యూనీకార్న్ 160 సింగిల్ సిలిండ‌ర్‌, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో మార్కెట్‌లో ఉంది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 13 బీహెచ్‌పీ విద్యుత్‌, 14 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. హోండా హార్నెట్ బైక్ 184.4 సీసీ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది.

హార్నెట్ ఇంజిన్ గ‌రిష్టంగా 17 బీహెచ్పీ విద్యుత్‌, 16 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. కొత్త‌గా వ‌చ్చే బైక్ 162సీసీ సింగిల్ సిలిండ‌ర్ ఎయిర్ కూల్డ్ మోటార్‌తో విభిన్నంగా ట్యూన్ అవుతుంద‌ని భావిస్తున్నారు. ఇంజిన్ సామ‌ర్థ్యానికి అనుగుణంగా అధిక విద్యుత్‌, టార్చి వెలువ‌రించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.

కొత్త హోండా మోటారు సైకిల్ సంప్ర‌దాయ టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఎట్ ఫ్రంట్‌, మోనోషాక్ ఎట్ రేర్‌, డిస్క్ బ్రేకులతో వ‌స్తున్న‌ది. హోండా మోటారు సైకిల్స్ న్యూ బైక్ ధ‌ర రూ.ల‌క్ష నుంచి రూ.1.15 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ఉండొ్చున‌ని తెలుస్తుంది.

Honda New Sports Bike | హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూట‌ర్స్‌.. మార్కెట్లోకి బుధ‌వారం కొత్త స్పోర్ట్స్ బైక్ తీసుకురానున్న‌ది. 160-180 సీసీ సెగ్మెంట్‌లో హీరో, బ‌జాజ్‌, టీవీఎస్‌, య‌మ‌హా మోటారు సైకిళ్ల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది.

First Published:  1 Aug 2023 2:41 PM IST
Next Story