Honda CB300R | స్పోర్టీ లుక్‌తో హోండా సీబీ300 ఆర్ బైక్ ఆవిష్కరణ.. ధరెంతంటే..?!
Honda CB300R | దేశంలోనే ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ.. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda Motorcycle & Scooter India).. మార్కెట్లోకి హోండా సీబీ300 ఆర్ 2023 (Honda CB300R 2023)ను ఆవిష్కరించింది.
Honda CB300R | దేశంలోనే ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ.. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda Motorcycle & Scooter India).. మార్కెట్లోకి హోండా సీబీ300 ఆర్ 2023 (Honda CB300R 2023)ను ఆవిష్కరించింది. రెట్రో-ఇన్‌స్పైర్డ్ డిజైన్‌తోపాటు అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్నదీ బైక్. హోండా సీబీ300ఆర్ బైక్ ధర రూ.2.40 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ప్రీమియం సింగిల్ సిలిండర్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుందీ హోండా సీబీ300ఆర్-2023 బైక్. బ్లాక్ హెడ్ ల్యాంప్‌తో వస్తున్న హోండా సీబీ300 ఆర్ బైక్ చూడటానికి స్పోర్టీ లుక్ కలిగి ఉంటుంది.
286.01సీసీ, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఒబీడీ2ఏ- కంప్లియంట్, పీజీఎం-ఎఫ్ఐ ఇంజిన్‌తో వస్తోంది హోండా సీబీ 300 ఆర్ 2023 మోటారు సైకిల్. ఈ ఇంజిన్ గరిష్టంగా 31.1 పీఎస్ విద్యుత్, 27.5 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో నడుస్తుంది. ఐకానిక్ హోండా సీబీ 100 ఆర్ స్ఫూర్తిగా రూపుదిద్దుకున్నది హోండా సీబీ300ఆర్. లీటర్ క్లాస్ రోడ్‌స్టర్, మస్క్యులర్ ఫ్యుయల్ ట్యాంక్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, రౌండ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ వింకర్స్, ఎల్ఈడీ టెయిల్ లాంప్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, హజార్డ్ లైట్ స్విచ్, న్యూ ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ గేర్ పొజిషన్ ఇండికేటర్, షిఫ్ట్ లైట్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
హోండా సీబీ300 ఆర్ బైక్ 41ఎంఎం యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్ అండ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఎట్ రేర్, 296ఎంఎం ఫ్రంట్ డిస్క్, 220 ఎంఎం రేర్ డిస్క్ బ్రేక్‌లు కలిగి ఉంటుంది. స్టాండర్డ్‌గా డ్యుయల్ చానెల్ ఏబీఎస్ ఉంటుంది. రెండు కలర్ ఆప్షన్లు - పెరల్ స్పార్టన్ రెడ్, మ్యాట్టె మాసివ్ గ్రే మెటాలిక్ రంగుల్లో లభిస్తుంది. ఈ మోటారు సైకిల్ కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 (Harley-Davidson X440), ట్రయంఫ్ స్పీడ్ 400 (Triumph Speed 400), టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 వంటి బైక్స్‌తో పోలిస్తే.. నియో రెట్రో స్టైలింగ్‌తో రూపుదిద్దుకున్నహోండా సీబీ300 ఆర్ బైక్.. ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ (Triumph Speed 400)తో తల పడుతుంది. రెండింటి మధ్య కేవలం రూ.7000 (ఎక్స్ షోరూమ్) తేడా ఉండటం ఆసక్తి కర పరిణామం.