తక్కువ రిస్క్‌తో బోలెడు రాబడులు
మ్యూచువల్ ఫండ్ కొత్త ఫండ్ ఆఫర్ ప్రకటించిన ఆదిత్య బిర్లా సన్ లైఫ్

మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న చాలామంది చూసేది రిస్క్ ఫ్యాక్టర్. తక్కువ రిస్క్‌తో ఎక్కువ లాభాలు లేదా బ్యాలెన్స్‌డ్ లాభాలను అందించే ఫండ్స్‌ను తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇలాంటి వారి కోసం మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఎప్పటికప్పుడు నయా నయా ఫండ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే తాజాగా.. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్త ఫండ్ ఆఫర్ ప్రకటించింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ క్రిసిల్-ఐబీఎక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 9-12 నెలల డెట్ ఇండెక్స్ ఫండ్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఈ ఇండెక్స్‌ను ఫండ్ ట్రాక్ చేస్తుంది. ఇది ఓపెన్ - ఎండెడ్ స్థిరమైన మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. కొత్త ఫండ్ ఆఫర్ మార్చి 18న ప్రారంభమై, మార్చి 20న ముగుస్తుంది. తక్కువ రిస్క్‌తో రాబడులు కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ అనువైనదిగా సంస్థ తెలిపింది. స్థిరమైన మెచ్యూరిటీ, 9 నుంచి 12 నెలల వరకు రోల్ డౌన్ వ్యూహంతో ఈ ఫండ్ తక్కవ వ్యవధి ఉన్న సెక్యూరిటీలు ప్రధానంగా కమర్షియల్ పేపర్స్, డిపాజిట్ సర్టిఫికెట్లు, బాండ్లపై దృష్టి పెడుతుంది. వడ్డీ రేట్ల హెచ్చు తగ్గులకు ఎక్కవ ప్రభావితం కాకుండా చూస్తుంది.