Telugu Global
Business

Indian Students in UK | ఇరుకు ఇండ్ల‌కూ భారీ అద్దె.. అటుపై వీసా ఫీజు పెంపు.. బ్రిట‌న్‌లో భార‌త్ విద్యార్థుల ఇక్క‌ట్లు..!!

Indian Students in UK | భార‌తీయుల్లో అత్య‌ధికులు ఉన్న‌త విద్యాభ్యాసం కోసం విదేశాల‌కు త‌ర‌లి వెళుతున్నారు.

Indian Students in UK | ఇరుకు ఇండ్ల‌కూ భారీ అద్దె.. అటుపై వీసా ఫీజు పెంపు.. బ్రిట‌న్‌లో భార‌త్ విద్యార్థుల ఇక్క‌ట్లు..!!
X

Indian Students in UK | భార‌తీయుల్లో అత్య‌ధికులు ఉన్న‌త విద్యాభ్యాసం కోసం విదేశాల‌కు త‌ర‌లి వెళుతున్నారు. గ‌తంలో అమెరికాకు ఎక్కువ‌గా వెళ్లేవారు.. కానీ డొనాల్ట్ ట్రంప్ హ‌యాంలో తెచ్చిన ఆంక్ష‌ల వ‌ల్ల కెన‌డా, బ్రిట‌న్‌, యూర‌ప్ దేశాల వైపు మ‌ళ్లుతున్నారు. ఫ‌లితంగా కొన్నేండ్లుగా బ్రిట‌న్‌కు వెళ్లే భార‌తీయ విద్యార్థుల సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం 2022లో బ్రిట‌న్‌లో 55,465 మంది విద్యార్థులు విద్యార్థి వీసాపై ఉన్నారు. బ్రిట‌న్ హోంశాఖ క‌థ‌నం ప్ర‌కారం 2023 జూన్ నెలాఖ‌రు నాటికి విద్యార్థి వీసాపై 1,42,848 మంది భార‌త్ విద్యార్థులు జీవిస్తున్నారు.

రోజురోజుకు దేశానికి వ‌చ్చి పడే విదేశీ విద్యార్థుల‌కు చౌక‌గా ఇంటి వ‌స‌తి క‌ల్పించ‌డం క్లిష్ట‌త‌రంగా మారింది. లండ‌న్ యూనివ‌ర్సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకున్న శ్ర‌ద్దా చ‌క్ర‌వ‌ర్తి ఇటీవ‌లే డిగ్రీ పూర్తి చేసుకున్నారు. కానీ తన విద్యాభ్యాసం టైమ్‌లో అద్దెకు ఉన్న ఇంటికి వారానికి 299 పౌండ్లు చెల్లించాల్సి వ‌స్తున్న‌ద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. దీనికితోడు బ్రిట‌న్ ప్ర‌భుత్వం విద్యార్థి వీసాల ఫీజు భారీగా పెంచేసింది.

ఇంటద్దె పెరిగిపోవ‌డంతోపాటు స‌రిప‌డా స్పేస్ లేక ప‌లువురు భార‌తీయ విద్యార్థులు ఇరుకు ఇండ్ల‌లోనైనా ఉండ‌టానికి సిద్ధ ప‌డుతున్నారు. అందుకు చురుగ్గా వ్య‌వ‌హ‌రించాల్సిందేన‌ని చెబుతున్నారు. 2020 అక్టోబ‌ర్‌లో ఎంఎస్‌సీ- స‌ప్ల‌య్ చైన్ మేనేజ్మెంట్ కోర్స్ విద్యార్థి అరుణ్ పాట్రిక్‌.. తాను తొలుత ఉన్న ఇంట్లో కేవ‌లం ఐదుగురు మాత్ర‌మే నివాసం ఉండొచ్చనీ, ఇండ్ల కొర‌త‌తో ఒకే కామ‌న్ టాయిలెట్‌, కామ‌న్ కిచెన్ గ‌ల ఇంట్లో ఎనిమిది మంది స‌ర్దుకుంటున్నామ‌ని చెప్పారు.

నేను లండన్‌కు వ‌చ్చిన కొత్త‌ల్లో తొలిసారి ఇంటి అద్దెకు దిగడం.. అటు త‌ర్వాత రెండు వారాల‌కు 30 పౌండ్లతో బ‌య‌ట‌కు రావ‌డం ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను. అంద‌రు తిన‌గా మిగిలింది తిన‌డం. కొన్ని రోజుల త‌ర్వాత తిన‌డానికి ఏమీ మిగ‌ల‌క‌పోయేది. వ‌స‌తి వెతుక్కోవ‌డంలోనే టైం స్పెండ్ చేయ‌డం వ‌ల్ల ఉద్యోగం పొంద‌లేదు. పార్ట్ టైం ఉద్యోగిగా చేర్చుకోవ‌డానికి ఏ సంస్థ ముందుకు రాలేదు. అంత‌కుముందు ఏడాది పాటు ప‌ని చేసిన భార‌త్ రెస్టారెంట్‌లోనే త‌ర్వాత జాబ్ సంపాదించుకున్నా అని అరుణ్ అనే హెల్త్‌కేర్ అసిస్టెంట్ చెప్పాడు. క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత మూడేండ్ల‌కు కూడా ప‌రిస్థితుల్లో ఎటువంటి మార్పు లేద‌ని తెలిపాడు.

లీడ్స్ యూనివ‌ర్సిటీలో గ‌త నెల‌లో ఎంఏ-అడ్వ‌ర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ కోర్సులో చేరిన సిమ్రాన్ హిలాల్.. బ్రిట‌న్‌లో స‌రైన ఇల్లు వెతుక్కోవ‌డానికి ఆరు నెల‌లు ప‌ట్టింద‌న్నారు. గ‌త ఏప్రిల్ నుంచే బ్రిట‌న్‌లో అకామిడేష‌న్ కోసం ప్లాన్‌లు ప్రారంభించా. రీసెర్చ్ కోసం ఎక్కువ టైం కేటాయించాలి, నేను ఉండే ఇంటికి స‌మీపంలోనే ఇల్లు ఉండాలి. సేఫ్టీ, సమీపంలో సూప‌ర్ మార్కెట్‌లు, ర‌వాణ సౌక‌ర్యం త‌దిత‌ర విష‌యాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సిమ్రాన్ తన గాధ బ‌య‌ట పెట్టింది.

నిమిషాల్లో ఇంటిని ఎంచుకోవాలి. అందుకోసం వాట్సాప్‌, ఫేస్‌బుక్ గ్రూపుల్లో చురుగ్గా స్పందించాలి. స‌కాలంలో స్పందించ‌క‌పోతే రోజువారీగా ఉండ‌టానికి ఏజెంట్ల‌కు భారీగా ముడుపులు చెల్లించాల్సి వ‌స్తుంది. లేకపోతే వీధుల పాల‌వ్వాల్సి వ‌స్తుంద‌ని సిమ్రాన్ వాపోయింది. కొన్ని ఇండ్ల‌కు డిపాజిట్లు క‌ట్టినా స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని తెలిపింది.

బ్రిట‌న్‌లో ఇంటి అద్దె పొందాలంటే బ్రిట‌న్ వాసి హామీ త‌ప్ప‌నిస‌రి కావాలి. అంద‌రికీ ఈ నిబంధ‌న వ‌ర్తించ‌దు కానీ, అలా వ‌ర్తించే నిబంధ‌న కోసం భారీగా ఫీజు పే చేయాల్సి వ‌స్తుంది. అందుకోసం పార్ట్‌టైం ప‌ని చేయాల్సి ఉంటుంద‌ని విద్యార్థులు చెబుతున్నారు. విదేశీ విద్యార్థుల తాకిడి పెర‌గ‌డంతో 2020లో 29,048 స్టూడెంట్స్ రూమ్స్ కొత్త‌గా సిద్ధం చేస్తే, ఈ ఏడాది 13,543కు త‌గ్గిపోయాయ‌ని హయ్య‌ర్ ఎడ్యుకేష‌న్ పాల‌సీ ఇన్‌స్టిట్యూట్ యూనిపోల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ బ్లాకే తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో స్థానికులు యువ‌కుల‌కు ఇండ్లు అద్దెకు ఇవ్వ‌డానికి ఆలోచిస్తున్నారు. విద్యార్థుల కంటే ఉద్యోగుల‌కు ఇంటి అద్దెకు ఇవ్వ‌డానికి మొగ్గుచూపుతున్నార‌ని స్వాన్‌సీ యూనివ‌ర్సిటీ-వేల్స్ విద్యార్థి ఫిలిప్ వీ లోబో చెప్పారు. ఆసియా విద్యార్థులు అపరిశుభ్రంగా ఉంటార‌ని బ్రిట‌న్ వాసులు అభిప్రాయం అన్నారు.

ఇదిలా ఉంటే, గాయంపై రోక‌టి పోటు అన్న‌ట్లు ఇంటి అద్దె త‌ల‌కు మించిన భారంగా మారితే, ఇటీవ‌లే బ్రిట‌న్ స‌ర్కార్ విద్యార్థులతోపాటు వీసా ఫీజు 127 పౌండ్లు పెంచేసింది. ఒక విద్యార్థి త‌న వీసా పున‌రుద్ధ‌ర‌ణ కోసం రూ.51,787 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో భార‌తీయ విద్యార్థులు బ్రిట‌న్ యూనివ‌ర్సిటీల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌తీయ విద్యార్థులు త‌మ ఆర్థిక భారాన్ని త‌గ్గించుకునేందుకు ఆచితూచి ఆర్థిక ప్ర‌ణాళిక రూపొందించుకోవాల్సి ఉంటుంద‌ని క‌న్స‌ల్టెన్సీ సంస్థ‌లు చెబుతున్నాయి. విదేశీ విద్యార్థులు త‌మ జ‌నాభాను మించిపోకుండా చూసేందుకే బ్రిట‌న్ స‌ర్కార్ వీసా ఫీజు పెంచింద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇంటి అద్దెకు తోడు వీసా ఫీజు పెంపుతో భార‌తీయ విద్యార్థుల‌పై త‌డిసిమోపెడు భారం అవుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

First Published:  27 Oct 2023 11:45 AM IST
Next Story