Swiggy HDFC Bank Credit Card | క్యాష్‌బ్యాక్ ఆఫర్లకు ఈ క్రెడిట్ కార్డు బెస్ట్.. ఇవీ డిటైల్స్..!
Swiggy HDFC Bank Credit Card | గతంతో పోలిస్తే క్రెడిట్ కార్డుల వాడకం పెరిగింది. క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్న వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా తమ కస్టమర్ల పునాది పెంచుకునేందుకు పలు రకాల పద్దతులు, విధానాలు పాటిస్తున్నాయి.
Swiggy HDFC Bank Credit Card | గతంతో పోలిస్తే క్రెడిట్ కార్డుల వాడకం పెరిగింది. క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్న వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా తమ కస్టమర్ల పునాది పెంచుకునేందుకు పలు రకాల పద్దతులు, విధానాలు పాటిస్తున్నాయి. ఇతర సంస్థలతో కలిసి జారీ చేస్తున్న కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో కస్టమర్లకు బోలెడు బెనిఫిట్లు ఉన్నాయి. వాటిల్లో క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వివిధ రకాల ట్రాన్సాక్షన్స్ మీద క్రెడిట్ కార్డు జారీ చేస్తున్న బ్యాంకులు, సంస్థలు కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాయి. ఆ జాబితాలో వచ్చి చేరింది మరో క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు.
ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌లో అత్యంత పాపులర్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీతో కలిసి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో చేతులు కలిపింది. స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు (Swiggy HDFC Bank Credit Card) జారీ చేసింది. స్విగ్గీ యాప్ ద్వారా ప్రతి ఫుడ్ ఆర్డర్,గ్రాసరీ కొనుగోలు లేదా రెస్టారెంట్లలో డైన్ఔట్ బిల్లులు చెల్లిస్తే పది శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.
అమెజాన్, మైంత్రా, నైకా, ఓలా, ఉబెర్, ఫార్మ్ఈజీ, నెట్‌మెడ్స్, బుక్‌మైషో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్, ఈ-కామర్స్ వేదికలపై స్పెండింగ్ మీద ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభిస్తున్నది. మిగతా అన్ని రకాల ఆన్‌లైన్ లావాదేవీలపై ఒకశాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తున్నది.
దేశంలో అందుబాటులో ఉన్న మరో రెండు అత్యంత పాపులర్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌తో కూడిన కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులు.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు (Flipkart Axis Bank Credit Card), అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు (Amazon Pay ICICI Credit Card)లతో పోలిస్తే స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు చాలా ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. అన్ని రకాల ఫుడ్ డెలివరీ ఆర్డర్లు, గ్రాసరీ కొనుగోలు ఆర్డర్లపై పది శాతం, పేరొందిన బ్రాండ్ ప్లాట్‌ఫామ్స్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఆన్‌లైన్ కొనుగోళ్లపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తున్నది స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌బ్యాంక్ క్రెడిట్ కార్డు, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు ఇచ్చే క్యాష్‌బ్యాక్ ఆఫర్ల కంటే స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ఇచ్చే బెనిఫిట్లు ఎక్కువ. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డుపై అన్ని రకాల ఆన్‌లైన్ పేమెంట్స్ మీద ఐదు శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తున్నది.
స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుపై ప్రతి నెలా రూ.1500 వరకు 10 శాతం, రూ.1500 వరకూ ఈ-కామర్స్, పేరొందిన బ్రాండ్ల ఆన్‌లైన్ పేమెంట్స్‌పై ఐదు శాతం, ఇతర ఆన్‌లైన్ వ్యవస్థల్లో రూ.500 చెల్లింపుపై ఒకశాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ప్రతి నెలా రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఆన్‌లైన్ స్పెండింగ్ చేసిన వారికి ఈ క్యాష్‌బ్యాక్ బెనిఫిట్లు లభిస్తాయి.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఐదు శాతం, నాన్-ప్రైమ్ మెంబర్లకు మూడు శాతం, అమెజాన్ పే పార్టనర్ మర్చంట్ల వద్ద చెల్లింపులపై రెండు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఇతర ఆన్‌లైన్ లావాదేవీలపై ఒకశాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. పార్టనర్ రెస్టారెంట్లలో డైన్ ఔట్ పేమెంట్స్ మీద 15 శాతం వరకూ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లపై ఐదు శాతం, ప్రిఫర్డ్ మర్చంట్ల వద్ద కొనుగోళ్ల మీద నాలుగు శాతం, ఇతర ఆన్‌లైన్ చెల్లింపులపై 1.5 శాతం క్యాష్‌బ్యాక్, పార్టనర్ రెస్టారెంట్లలో డైన్ ఔట్ చెల్లింపుల మీద 20 శాతం వరకూ, ఏడాదిలో నాలుగు సార్లు దేశీయ విమానాశ్రయ లాంజ్‌ల్లో ఎంట్రీ ఫీజుపై 20 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.