Raghuram Rajan | వృద్ధిరేటుపై ప్రచారార్భాటాన్ని నమ్మితే పెద్ద పొరపాటు.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ హెచ్చరిక..!
Raghuram Rajan | దేశ ఆర్థికాభివృద్ధిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Raghuram Rajan | దేశ ఆర్థికాభివృద్ధిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ శక్తి సామర్థ్యాలకనుగుణంగా అభివృద్ధి సాధించేందుకు కీలక సంస్థాగత సమస్యలు పరిష్కరించకుండా ఆర్థికాభివృద్ధి చుట్టూ ప్రచారార్భాటం చేయడం అతిపెద్ద పొరపాటు అని వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక అభివృద్ధిపై కేంద్రం చేస్తున్నదంతా ప్రచారార్భాటమే అని కొట్టి పారేశారు. వృత్తి నైపుణ్యం, విద్యా వసతులను మెరుగు పరచడం ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం పెనుగులాట తప్పదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సంస్థాగత సమస్యలు పరిష్కరించకుండా దేశంలోని యువతరానికి లబ్ధి చేకూర్చడానికి భారత్ ఘర్షణ పడాల్సి వస్తుందన్నారు. దేశంలోని 140 కోట్ల మంది జనాభాలో సగానికి పైగా 30 ఏండ్లలోపు వారేనని పేర్కొన్నారు. ప్రచారార్భాటాన్ని నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నం అతి పెద్ద పొరపాటు అని అన్నారు.
ప్రచారార్భాటమే నిజమని నమ్మడానికి మనం ఏండ్ల తరబడి కష్టపడి పని చేయాల్సి వస్తుంది. ప్రచారార్భాటాన్ని నమ్ముకున్న కొందరు రాజకీయ నాయకులు ఇప్పటికే మనం లక్ష్యాన్ని చేరుకున్నామని మీరు నమ్మాలని వారు కోరుకుంటున్నారు. కానీ ఈ ప్రచారార్భాటాన్ని నమ్మడం భారత్‌కు, భారతీయులకు తీవ్రమైన పొరపాటుగా నిలుస్తుంది అని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. 2047 నాటికి భారత్ ఆర్థిక వృద్ధి సాధించిన దేశంగా నిలవాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షను కొట్టిపారేశారు. `స్కూల్ డ్రాపవుట్లు గరిష్టస్థాయికి పెరిగిపోయాయి. ఈ తరుణంలో మీ పిల్లలకు ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం అందించకుండా, 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అని పేర్కొనడం అర్ధరహితం అని అన్నారు.
మనదేశంలో శ్రామికశక్తి పెరుగుతున్నది. ఆ శ్రామిక శక్తికి మంచి ఉద్యోగాలు కల్పించినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. మనం విషాదకర పరిస్థితులను ఎదుర్కొంటాం. తొలుత శ్రామికశక్తికి ఉపాధి కల్పించాలి. దేశీయ అవసరాలకు అనుగుణంగా శ్రామికశక్తికి కొత్త కొలువులు సృష్టించాలి అని రఘురామ్ రాజన్ చెప్పారు. కొవిడ్-19 తర్వాత భారత్‌లోని పాఠశాల విద్యార్థుల అభ్యాస శక్తి 2012 నాటికి తగ్గిపోయినదని నివేదికలు చెబుతున్నాయి. 20.5 శాతం మంది గ్రేడ్-3 విద్యార్థులు గ్రేడ్-2 పుస్తకాలు చదవగలుగుతున్నారు. వియత్నాం వంటి ఆసియా దేశాల్లో కంటే అక్షరాస్యత శాతం తగ్గిపోతున్నది. ఇది నిజంగా మనందరికీ ఆందోళనకరం. మానవ రాజధానిగా పేరొందిన మనదేశంలో లోపాలు సరిదిద్దకుంటే దశాబ్దాల తరబడి వేచి చూడాల్సిందే ` అని రాజన్ పేర్కొన్నారు.
ఏటా ఎనిమిది శాతం సుస్థిర వృద్ధిరేటు సాధించడానికి భారత్ ఎంతో సాధించాల్సి వస్తుందని రఘురామ్ రాజన్ తేల్చి చెప్పారు. ఆర్థిక శ్రేయస్సుపై ఇటీవలి ఆశావాహ దృక్పథ భావనలు దెబ్బ తీస్తాయన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ ఇన్వెస్టర్లు శరవేగంగా విస్తరిస్తున్నారని, వచ్చే ఏడాది ఏడు శాతానికి పైగా విదేశీ పెట్టుబడులు వచ్చి పడతాయని అంచనా వేశారు. చిప్‌ల తయారీ సంస్థలకు భారీ సబ్సిడీలు ఇస్తున్న మోదీ సర్కార్..ఉన్నత విద్యాభ్యాసానికి అంతకంటే తక్కువ ఖర్చు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ బిజినెస్ స్థాపనకు రూ.76,000 కోట్ల సబ్సిడీ అందిస్తున్న మోదీ సర్కార్.. ఉన్నత విద్యాభ్యాసానికి రూ.47,600 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు.