Gold Rates | మళ్లీ బంగారం `ధగధగ`లు.. కారణాలివేనా..?!
Gold Rates | వారం, పది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ సోమవారం ధగధగ మెరిశాయి.
Gold Rates | వారం, పది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ సోమవారం ధగధగ మెరిశాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా హమస్ మధ్య యుద్ధం నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు తమకు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ మార్గంగా బంగారాన్నే పరిగణిస్తున్నారు. దీంతో సోమవారం ఒకశాతానికి పైగా బంగారం ధరలు పెరిగాయి. పండుగల సీజన్ నేపథ్యంలో పది రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలతో బంగారం కొనుగోళ్లకు ఇదే సరైన సమయం అని అంతా భావించారు. కానీ మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ధరలు పెరిగిపోవడంతో కొనుగోళ్లు తగ్గుతాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
బంగారం పెరుగుదలకు కారణాలివీ..
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ఒక శాతం పెరిగి 1850.87 డాలర్లు పలుకుతున్నది. ఈ వారంలో ఇదే అత్యధికం. అమెరికా మార్కెట్‌లో ప్యూచర్స్ బంగారం ఔన్స్ ధర సైతం 1.1 శాతం వృద్ధి చెంది 1865.20 డాలర్ల వద్ద స్థిర పడింది. మరోవైపు స్పాట్ వెండి ఔన్స్ ధర 1.6 శాతం వృద్ధితో 21.96 డాలర్లు, ప్లాటినం 0.6 శాతం పుంజుకుని 881.83 డాలర్లు, పల్లడియం 0.5 శాతం లబ్ధితో 1163.49 డాలర్ల వద్ద నిలిచింది.
హమాస్ తిరుగుబాటుదారులు గత శనివారం ఇజ్రాయెల్‌లోని పలు పట్టణాలపై రాకెట్ లాంచర్లు వినియోగించారు. దానికి ప్రతిగా పాలస్తీనాపై గాజా వద్ద ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో ఇరువైపులా వందల మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
మిడిల్ ఈస్ట్‌లో అనిశ్చితి నేపథ్యంలో అమెరికా డాలర్, జపాన్ యెన్ బలోపేతం అయ్యాయి.
వారం పది రోజులుగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో రూ.3000 వరకూ తగ్గిన బంగారం ధర తిరిగి పుంజుకున్నది. హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.53,350 వద్ద, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.57.980 వద్ద నిలిచింది.
నగరాల వారీగా బంగారం ధరలు ఇలా (10 గ్రాములు)
నగరం --- 22 క్యారట్లు -- 24 క్యారట్లు
చెన్నై ---- రూ.53,650 ---- రూ.58,530
ముంబై --- రూ.53,350 --- రూ.58,200
ఢిల్లీ --- రూ. 53,500 -- రూ. 58,350
కోల్‌కతా -- రూ. 53,350 -- రూ. 58,200
బెంగళూరు -- రూ. 53,500 -- రూ.58,200
హైదరాబాద్ -- రూ. 53,350 -- రూ. 58,200
పుణె -- రూ.53,350 -- రూ. 58,200
వడోదర -- రూ. 53,400 - రూ.58,250
అహ్మదాబాద్-- రూ.53,400 -- రూ.58,250
జైపూర్ -- రూ.53,500 -- రూ. 58,350
లక్నో -- రూ.53,500 -- రూ.58,350
కోయంబత్తూర్ - రూ.53,650 - రూ. 58,530
మదురై - రూ.53,650 - రూ.58,530
విజయవాడ - రూ.53,350 - రూ.58,200
నాగ్‌పూర్ - రూ. 53,350 - రూ. 58,200
సూరత్ -- రూ.53,400 - రూ. 58,250
భువనేశ్వర్ -- రూ.53,350 -- రూ.58,200
విశాఖపట్నం -- రూ. 53,350 -- రూ.58,200
గుర్గావ్ - రూ.53,500 - రూ.58,350
ఘజియాబాద్ - రూ.53,500 - రూ.58,350
నోయిడా - రూ.53,500 - రూ.58,350
సేలం - రూ.53,650 - రూ.58,530
వెల్లూర్ - రూ.53,650 - రూ.58,530
గుంటూరు - రూ.53,350- రూ.58,200
వరంగల్ - రూ.53,350 - రూ.58,200
ఖమ్మం - రూ.53,350 - రూ.58,200
షోలాపూర్ - రూ.53,350- రూ.58,200
కొల్హాపూర్ - రూ.53,350 - రూ.58,200
ఎరోడ్ - రూ.53,650 - రూ.58,530
ఇండోర్ - రూ.53,400 - రూ.58,250
కాన్పూర్ - రూ.53,500 - రూ.58,350
తిరువనంతపురం - రూ.53,350 - రూ.58,200
తంజావూర్ - రూ.53,650 - రూ.58,530
భోపాల్ - రూ.53,400 - రూ.58,250
వారణాసి - రూ.53,500 - రూ.58,350
గోవా - రూ.53,350- రూ.58,200
కరూర్ - రూ.53,650 - రూ.58,530