నేడు (26-12-2022) స్థిరంగా బంగారం, వెండి ధరలు
Gold, silver rate today, 26 December 2022: సోమవారం ఉదయం వరకు బులియన్ మార్కెట్‌లో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850గా ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.54,380గానే ఉంది.
పసిడి భారీ ఊరటనిచ్చింది. గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతూ హడలెత్తించిన బంగారం కాస్త శాంతించింది. మొన్నటికి మొన్న రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర తర్వాత కాస్త తగ్గింది. క్షణాల వ్యవధిలో హెచ్చుతగ్గులను నమోదు చేసే పసిడి.. నిన్నటి నుంచి స్థిరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం ధరలో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. ఇక నిన్న ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగిన వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది.
సోమవారం ఉదయం వరకు బులియన్ మార్కెట్‌లో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850గా ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.54,380గానే ఉంది. ఇక దేశీయంగా కిలో వెండి ధర మొన్న 70,100 ఉన్న విషయం తెలిసిందే. అయితే నిన్న ఉదయానికి వెండి ధర రూ.1,000 పెరిగి రూ.71,100 చేరుకోగా.. ఇవాళ ఉదయానికి కూడా ఇదే ధర వెండి స్థిరంగా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేస్తే..
22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.49,850.. రూ.54,380
విజయవాడలో రూ.49,850.. రూ.54,380
విశాఖపట్నంలో రూ.49,850 .. రూ.54,380
చెన్నైలో రూ.50,790.. రూ.55,400
కోల్‌కతాలో రూ.49,850.. రూ.54,380
బెంగళూరులో రూ.49,900.. రూ.54,410
కేరళలో రూ.49,850.. రూ.54,380
ఢిల్లీలో రూ.50,000.. రూ.54,530
ముంబైలో రూ.49,850.. రూ.54,380
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,000
విజయవాడలో రూ.74,000
విశాఖపట్నంలో రూ.74,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000
బెంగళూరులో రూ.74,000
కేరళలో రూ.74,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,100
ముంబైలో కిలో వెండి ధర రూ.71,100