Gold, Silver Price Today: నేడు (17-12-2022) స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
Gold, silver price today: శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.290 మేర తగ్గి రూ.49,700కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.310 తగ్గి రూ.54,220కి చేరుకుంది.
మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ బాగానే ఉంటుంది. స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనైనప్పుడు.. చాలా మంది సేఫ్‌గా తమ డబ్బును బంగారంపై ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ధరలు నిత్యం మారుతూ ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో మొన్నటి వరకూ పరుగులు తీసి బంగారం ప్రియులను కలవరపెట్టింది. అయితే ప్రస్తుతం బంగారం క్రమంగా శాంతిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా రెండో రోజూ బంగారం ధర పతనమైంది. ఇదే సమయంలో వెండి ధర కూడా భారీగా తగ్గింది. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.290 మేర తగ్గి రూ.49,700కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.310 తగ్గి రూ.54,220కి చేరుకుంది. దేశీయంగా కిలో వెండి ధర దాదాపు రూ.200 తగ్గింది. దీంతో వెండి ధర రూ.72,500కు చేరింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.49,700.. రూ.54,220
విజయవాడలో రూ.49,700.. రూ.54,220
విశాఖపట్నంలో రూ.49,700.. రూ.54,220
చెన్నైలో రూ.50,450.. రూ.55,040
కోల్‌కతాలో రూ.49,700.. రూ.54,220
బెంగళూరులో రూ.50,750.. రూ.54,280
కేరళలో రూ.49,700.. రూ.54,220
ఢిల్లీలో రూ.49,850.. రూ.54,380
ముంబైలో రూ.49,700.. రూ.54,220
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,500
విజయవాడలో రూ.72,500
విశాఖపట్నంలో రూ.72,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.72,500
బెంగళూరులో రూ.72,500
కేరళలో రూ.72,500
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,500
ముంబైలో కిలో వెండి ధర రూ.69,500