Gold Rates | బంగారంపై పెట్టుబడికిదే కరక్ట్ టైం.. కారణాలివేనా..?!
Gold Rates | ధరల కట్టడికి అమెరికా ఫెడ్ రిజర్వ్, యూరోపియన్ యూనియన్ బ్యాంక్‌తో సహా ప్రధాన దేశాల కేంద్రీయ బ్యాంకులు సుదీర్ఘకాలం వడ్డీరేట్లను పెంచాలని నిర్ణయించడం.. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధర దిగి వస్తున్నది.
Gold Rates | ధరల కట్టడికి అమెరికా ఫెడ్ రిజర్వ్, యూరోపియన్ యూనియన్ బ్యాంక్‌తో సహా ప్రధాన దేశాల కేంద్రీయ బ్యాంకులు సుదీర్ఘకాలం వడ్డీరేట్లను పెంచాలని నిర్ణయించడం.. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధర దిగి వస్తున్నది.
పండుగల సీజన్ ప్రారంభం కావడంతో బంగారంపై పెట్టుబడులు పెట్టాలని భావించే వారికి, బంగారం ఆభరణాలు కొనుక్కునే వారికి సానుకూల వాతావరణం నెలకొందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారం తులం తగ్గినా రూ.58 వేల మార్క్ పైనే కొనసాగుతున్నా.. జ్యువెల్లరీ దుకాణాలు అందిస్తున్న నెలవారీ డిపాజిట్ స్కీమ్‌లో కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
శుక్రవారం బులియన్ మార్కెట్‌లో తులం బంగారం ధర (24 క్యారట్స్) ధర రూ.250 తగ్గి రూ.58,700 వద్ద స్థిర పడింది. గత నాలుగు రోజులుగా పసిడి ధర క్రమంగా తగ్గుతూ వస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో మార్చి 19 తర్వాత బంగారం ధర దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. ఆరు నెలల తర్వాత బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి.
గత నాలుగు రోజుల్లో తులం బంగారం ధర రూ.1350 తగ్గింది. ఈ నెల 26న బంగారం తులం (24 క్యారట్స్) ధర రూ.60,050 పలికింది. మరోవైపు కిలో వెండి ధర కూడా ఒడిదొడుకులకు గురవుతోంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.1200 పెరిగి రూ.74.300 వద్ద స్థిర పడింది. అంతకుముందు రెండు సెషన్లలో రూ.1400 పతనమైంది.
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 1871 డాలర్లు పలికితే, ఔన్స్ వెండి 23.05 డాలర్లకు చేరుకున్నది. బుధవారం ఔన్స్ బంగారం ధర 1897 డాలర్లు ఉంటే గురువారం 1877 డాలర్లు, శుక్రవారం ఔన్స్ వెండి ధర 22.80 డాలర్లు, గురువారం 22.55 డాలర్ల వద్ద నిలిచింది.
ఈ ఏడాది జనవరి నుంచి బంగారం ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. మార్చి 19న తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.60,470 పలికితే, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్స్ బంగారం తులం రూ.55,470 వద్ద నిలిచింది.