నేడు (17-11-2022) మళ్లీ పెరిగిన బంగారం ధర..
Today Gold Rate: ఇక వెండి విషయానికి వస్తే.. కిలోపై రూ. 700 వరకూ తగ్గి.. రూ.62,000లకు చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల బంగారం పరుగుకు నిన్న బ్రేక్ పడిన విషయం తెలిసిందే. నిన్న బంగారం ధర కాస్త తగ్గింది. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. నేడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అయితే వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,360 గా ఉంది. నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్లపై రూ.200, 24 క్యారెట్లపై రూ.210 మేర ధర పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలోపై రూ. 700 వరకూ తగ్గి.. రూ.62,000లకు చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.48,000.. రూ.52,360
విజయవాడలో రూ.48,000.. రూ.52,360
విశాఖపట్నంలో రూ.48,000.. రూ.52,360
చెన్నైలో రూ.49,700.. రూ.54,210
కోల్‌కతాలో రూ.48,000.. రూ.52,360
బెంగళూరులో రూ.48,050.. రూ.52,410
కేరళలో రూ.48,000.. రూ.52,360
ఢిల్లీలో రూ.48,150.. రూ.52,510
ముంబైలో రూ.48,000.. రూ.52,360
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,500
విజయవాడలో రూ.68,500
విశాఖపట్నంలో రూ.68,500
చెన్నైలో రూ.68,500
బెంగళూరులో రూ.68,500
ఢిల్లీలో రూ.62,000
ముంబైలో రూ.62,000