నేడు (10-11-2022) పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Rates Today: ఇక నేడు 10 గ్రాముల బంగారం 600కు పైగా పెరిగింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..
సాధారణంగా బంగారం, వెండి ధరల్లో రోజువారీగా మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో గడిచిన రెండు రోజుల్లో బంగారం ధర అత్యంత స్వల్పంగా తగ్గింది. ఇక నేడు 10 గ్రాముల బంగారం 600కు పైగా పెరిగింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.560 పెరిగి రూ.47,360కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.620 వరకూ పెరిగి రూ.51,670కి చేరుకుంది. ఇక దేశీయంగా కిలో వెండి పై రూ.850 వరకూ పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..
ఢిల్లీలో రూ.47,460 .. రూ.51,770
ముంబైలో రూ.47,360.. రూ.51,670
కోల్‌కతాలో రూ.47,360.. రూ.51,670
బెంగళూరులో రూ.47,410.. రూ.51,720
కేళలో రూ.47,360.. రూ.51,670
హైదరాబాద్‌లో రూ.47,360.. రూ.51,670
విజయవాడలో రూ.47,360.. రూ51,670
విశాఖలో రూ.47,360.. రూ.51,670
వెండి ధర..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,400
విజయవాడలో రూ.67,400
విశాఖలో రూ.67,400 ఉంది.
చెన్నైలో రూ.67,400
కోల్‌కతాలో రూ.61,700
బెంగళూరులో రూ.67,400
ముంబైలో రూ.61,700
ఢిల్లీలో రూ.61,700