Gold/ Stocks Returns | బంగారం.. స్టాక్స్‌పై ఇన్వెస్ట్‌మెంట్స్.. రిటర్న్స్ ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold/ Stocks Returns | భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం.
Gold/ Stocks Returns | భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం..అందునా మహిళలకు ఆభరణాలంటే చాలా ప్రీతి. ప్రతి పండక్కి, పెండ్లిండ్లు, కుటుంబ వేడుకలకు పిసరంత బంగారం కొనడానికి ఇష్ట పడతారు. తమ ఆభరణాలన్నీ ధరించడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అంతే కాదు ఇటీవలి కాలంలో బెస్ట్ రిటర్న్స్‌కు బంగారం ఆల్టర్నేటివ్ పెట్టుబడి ఆప్షన్.
1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాక స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపైనా మంచి రిటర్న్స్ వచ్చాయి. అంటే బంగారం, స్టాక్స్‌లో పెట్టుబడులపై దాదాపు సమానమైన లాభాలు గడిస్తున్నారు. గత 17 ఏండ్లలో ఇటు బంగారం.. అటూ స్టాక్స్ మీద దాదాపు 500 శాతం రిటర్న్స్ వచ్చాయి. ఏయేటికాయేడు బంగారం, స్టాక్స్ మీద రిటర్న్స్ ఎక్కువో తక్కువో ఉంటాయి. కనుక ఇప్పుడు స్టాక్ మార్కెట్లు, బంగారం పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లుగా ఉన్నాయి. బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణిస్తే, స్టాక్ మార్కెట్ రిస్కీ ఆప్షన్‌గా ఉంటుంది. కానీ, 2006-2013 మధ్య బంగారం, సెన్సెక్స్ ఇన్వెస్టర్లకు దాదాపు ఒకే తరహాలో రిటర్న్స్ ఇచ్చాయి. 2006లో సెన్సెక్స్, బంగారం ఆప్షన్లలో ఎవరైనా రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెట్టారనుకుందాం.. నాటి నుంచి 17 ఏండ్లలో రూ.6 లక్షలకు పెరిగింది. దీని అర్థం 500 శాతం లాభం అని తెలుస్తున్నది.
పలువురు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు సంప్రదాయంగా బంగారంలో పెట్టుబడులు పెట్టొద్దని సూచిస్తుంటారు. దీనిపై రెగ్యులర్ ఆదాయం లేదని, డెడ్ అసెట్ అని అభిప్రాయ పడుతుంటారు. అదే సమయంలో మీ పెట్టుబడిలో కనీసం 10-15 శాతం బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని నిపుణులు సూచిస్తారు. బంగారం సురక్షితమైన విభిన్నమైన పెట్టుబడి ఆప్షన్. దీర్ఘకాలంలో బంగారంపై గుడ్ రిటర్న్స్ లభిస్తాయి.
బంగారంతో పోలిస్తే స్టాక్ మార్కెట్‌లో పలు ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు ఉన్నాయి. ఉదాహరణకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో 5000కి పైగా కంపెనీలు లిస్టయ్యాయి. కొన్ని కంపెనీల్లో వ్యక్తిగతంగా మీరు పెట్టుబడి పెట్టారనుకుంటే కొంత రిస్క్ కూడా ఉంటుంది. కానీ కొన్ని కంపెనీల్లో పెటటుబడులపై వేల శాతం రిటర్న్స్ లభిస్తున్నాయి. పలు కంపెనీల్లో పెట్టుబడులపై లాభాలు అనుమానమే. కానీ, స్టాక్ మార్కెట్లను పూర్తిగా అనాలసిస్ చేసి పెట్టుబడులు పెడితే రిటర్న్స్ లభిస్తాయి. స్టాక్ మార్కెట్, బంగారంల్లో పెట్టే పెట్టుబడుల మీద మీకు వచ్చే రిస్క్, రిటర్న్స్ ఆధార పడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
2001-16 మధ్య బంగారం, స్టాక్స్ పై రిటర్న్స్ ఇలా
సంప్రదాయంగా భారతీయులు బంగారంపై దీర్ఘకాలికంగా పెడుతుంటారు. 2001-16 మధ్య బంగారం పెట్టుబడులపై ఏటా 13.66 శాతం రిటర్న్స్ ఇస్తుంటే, స్టాక్ మార్కెట్లపై 13.97 శాతం లాభాలు వచ్చాయి. అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఇన్వెస్టర్లు ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బంగారాన్ని పరిరక్షణ ఆప్షన్‌గా భావిస్తారు. భారత్ వంటి వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇన్వెస్టర్లు కరెన్సీ పతనం నుంచి రక్షణకు మొగ్గు చూపుతారు.
పశ్చిమ దేశాల ఇన్వెస్టర్లకు బంగారం, భారత్ వంటి దేశాల ఇన్వెస్టర్లకు సెన్సెక్స్ రిటర్న్స్‌తో సమానంగా రూపాయి పతనం నుంచి బంగారంపై పెట్టుబడులతో రక్షణ ఉంటది. ఏడాది ప్రాతిపదికన బంగారంపై 16.62 శాతం, సెన్సెక్స్ మీద 24.35 శాతం రిటర్న్స్.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తలెత్తిన 2008-09లో బంగారంపై రిటర్న్స్ 24.58 శాతం ఉంటే, సెన్సెక్స్ దాదాపు 38 శాతం పతనం. అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్ మార్గాల్లో ఒడిదొడుకులు, అనిశ్చితి తలెత్తితే బంగారం బెస్ట్ ఆల్టర్నేటివ్ పెట్టుబడి ఆప్షన్‌గా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి.