ఫ్లిప్‌కార్ట్ ఢమాల్ సేల్! ఆఫర్లపై ఓ లుక్కేయండి!
Flipkart Big Bachat Dhamaal Sale 2023: ‘బిగ్ బచాత్ ఢమాల్ సేల్’ పేరుతో మొదలైన ఈ సేల్‌లో కొన్ని ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లను ప్రకటించిది ఫ్లిప్‌కార్ట్.

ఫ్లిప్‌కార్ట్ ఢమాల్ సేల్! ఆఫర్లపై ఓ లుక్కేయండి!
కొత్త ఏడాదిలో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్ తీసుకొచ్చింది. ఈ సేల్ జనవరి 6 నుంచి 8 వరకు ఉంటుంది. ‘బిగ్ బచాత్ ఢమాల్ సేల్’ పేరుతో మొదలైన ఈ సేల్‌లో కొన్ని ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లను ప్రకటించిది ఫ్లిప్‌కార్ట్. వాటిపై ఓ లుక్కేస్తే..
ఫ్లిప్ కార్ట్ ఢమాల్ సేల్‌లో కిచెన్, కుక్ వేర్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్‌లో ప్రతీ రోజు అర్థరాత్రి12గం.కి, ఉదయం 8గం.కి , సాయంత్రం 4గం.కి బెస్ట్ డీల్స్ ఉంటాయని తెలిపింది.
ఈ సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటు ఉంది. అలాగే రిఫ్రిజిరేటర్లపై 55 శాతం, వాషింగ్ మిషన్లపై 60 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రూ.7499 నుంచి మంచి స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో భాగంగా రూ.999 నుంచే బెస్ట్ స్మార్ట్ వాచ్‌లను సొంతం చేసుకోవచ్చు. ఇక వీటితో పాటు సేల్‌లో కొన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
ఇదిలా ఉంటే మరో కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా త్వరలో ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ తీసుకురాబోతుంది. ఈ నెల 19 నుంచి సేల్ మొదలవ్వబోతున్నట్టు అమెజాన్ ప్రకటించింది. 4 రోజుల పాటు ఉండే ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, హెడ్ ఫోన్స్‌తో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ ఉండబోతోంది.