Telugu Global
Business

Tata Nexon.ev Facelift | ఫేస్‌లిప్టెడ్ టాటా నెక్సాన్‌.ఈవీ ప్రీ-బుకింగ్స్‌.. 14న లాంచింగ్‌?!

Tata Nexon.ev Facelift | మారుతి సుజుకితో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దేశీయ కార్ల త‌యారీ సంస్థ టాటా మోటార్స్ జోరు మీదుంది. ఇటీవ‌లే టాటా నెక్సాన్ 2023 కారు ఆవిష్క‌రించిన టాటా మోటార్స్‌.. ఎల‌క్ట్రిక్ మోడ‌ల్ ఫేస్‌లిఫ్టెడ్‌ టాటా నెక్సాన్‌.ఈవీ (Tata Nexon.ev) ఆవిష్క‌రించ‌డానికి సిద్ధ‌మైంది.

Tata Nexon.ev Facelift | ఫేస్‌లిప్టెడ్ టాటా నెక్సాన్‌.ఈవీ ప్రీ-బుకింగ్స్‌.. 14న లాంచింగ్‌?!
X

Tata Nexon.ev Facelift | ఫేస్‌లిప్టెడ్ టాటా నెక్సాన్‌.ఈవీ ప్రీ-బుకింగ్స్‌.. 14న లాంచింగ్‌?!

Tata Nexon.ev Facelift | మారుతి సుజుకితో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దేశీయ కార్ల త‌యారీ సంస్థ టాటా మోటార్స్ జోరు మీదుంది. ఇటీవ‌లే టాటా నెక్సాన్ 2023 కారు ఆవిష్క‌రించిన టాటా మోటార్స్‌.. ఎల‌క్ట్రిక్ మోడ‌ల్ ఫేస్‌లిఫ్టెడ్‌ టాటా నెక్సాన్‌.ఈవీ (Tata Nexon.ev) ఆవిష్క‌రించ‌డానికి సిద్ధ‌మైంది. టాటా నెక్సాన్.ఈవీ కారు ఐసీఈ ఆధారిత ఇంజిన్ మోటార్‌తోనే వ‌స్తున్న‌ది. శ‌నివారం (2023 సెప్టెంబ‌ర్ 9) నుంచే ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. టాటా నెక్సాన్ ఈవీ-2023 కారు సొంతం చేసుకోవాల‌ని భావించే వారు రూ.21 వేలు చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవ‌చ్చు. గురువారం (2023 సెప్టెంబ‌ర్ 14) నాడు కార్ల ధ‌ర‌లు బ‌య‌ట ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.



గ‌తంలో మాదిరిగా ప్రైమ్‌, మ్యాక్స్ అనే పేర్ల‌కు బ‌దులు న్యూ నెక్సాన్‌.ఈవీ కారు మీడియం రేంజ్ వ‌ర్ష‌న్ (ఎంఆర్‌), సుదూర‌ శ్రేణి (ఎల్ఆర్‌) వ‌ర్ష‌న్ బ్రాండ్ల‌లో అందుబాటులోకి వ‌స్తోంది. ఎంఆర్ వేరియంట్ 30 కిలోవాట్ల బ్యాట‌రీ ప్యాక్‌, ఎల్ఆర్ వేరియంట్ 40.5 కిలోవాట్ల‌బ్యాట‌రీ ప్యాక్‌తో అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఎంఆర్ వేరియంట్ సింగిల్ చార్జింగ్‌తో 325 కిమీ దూరం, ఎల్ఆర్ వేరియంట్ 465 కి.మీ దూరం ప్ర‌యాణిస్తాయి. సుదూర శ్రేణి (ఎల్ఆర్‌) వ‌ర్ష‌న్ కారు పాత మోడ‌ల్‌తో పోలిస్తే 12 కి.మీ దూరం త‌క్కువ ప్రయాణిస్తుంది. మీడియం రేంజ్ (ఎంఆర్‌) వ‌ర్ష‌న్ నెక్సాన్ ఈవీ మాత్రం 13 కి.మీ. దూరం ఎక్కువ ప్ర‌యాణిస్తుంది.



నెక్సాన్.ఈవీ ఎస్‌యూవీ కారు జెన్‌2 మోటార్‌తో ప‌ని చేస్తుంది. 16000 ఆర్పీఎం వ‌ద్ద 106.4 కిలోవాట్లు (142.6 బీహెచ్పీ) విద్యుత్‌, 12000 ఆర్పీఎం వ‌ద్ద 215 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. ఈ కారు 8.9 సెక‌న్ల‌లో 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. గ‌రిష్టంగా గంట‌కు 150 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది. పాత మోడ‌ల్ కారుతో పోలిస్తే ఎన్వీహెచ్ (నాయిస్‌, వైబ్రేష‌న్‌, హార్ష్‌నెస్‌) స్థాయి త‌గ్గించి. రీ జ‌న‌రేష‌న్ వ‌యా పెడ‌ల్ షిఫ్ట‌ర్ల్స్ విత్ 10-15 శాతం రీ జెన‌రేష‌న్ ఎఫిషియెన్సీతో టాటా నెక్సాన్ ఈవీ వ‌స్తున్న‌ది.



ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌, ఎక్స్‌ప్రెస్ కూలింగ్‌, ఆటో డీఫాగ‌ర్ వంటి ఫీచ‌ర్లు, సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్‌, ఐఎస్ఓఫిక్స్ యాంక‌రేజ్‌, ఏబీఎస్‌, ఈఎస్‌పీ, 360 డిగ్రీల కెమెరా సిస్ట‌మ్ విత్ సెన్స‌ర్ ఫ్రంట్ అండ్ రేర్‌, కారులో ప్ర‌యాణించే వారంద‌రికీ సీట్‌బెల్ట్ రిమైండ‌ర్‌, ఫ్రంట్ పార్కింగ్ అసిస్టెన్స్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇంకా స్టాండ‌ర్డ్ ఎమ‌ర్జెనీ అండ్ బ్రేక్‌డౌన్ కాల్స్‌, హిల్ డిసెంట్ కంట్రోల్‌, హిల్ అసెంట్ కంట్రోల్‌, పానిక్ బ్రేక్ అల‌ర్ట్‌, ఆటో వెహిక‌ల్ హోల్డ్‌, ఐ-టీపీఎంఎస్ వంటి సేఫ్టీ ఫీచ‌ర్లు జ‌త చేవారు.


టాటా నెక్సాన్‌.ఈవీ మీడియం రేంజ్ కారు 7.2 కిలోవాట్ల చార్జింగ్ ఫీచ‌ర్ క‌లిగి ఉంటుంది. ఫాస్ట్ చార్జ‌ర్ సాయంతో 52 నిమిషాల్లో పూర్తిగా బ్యాట‌రీ చార్జింగ్ అవుతుంది. ట‌యోటా ఐయానిక్-5 కారులో మాదిరిగానే అదనంగా వీ2ఎల్ (వెహిక‌ల్ టూ లోడ్‌), వెహిక‌ల్ టు వెహిక‌ల్ (వీ2వీ) చార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వీ2ఎల్ 3.3 కేవీఏ, వీ2వీ చార్జ‌ర్ 5కేవీఏ వ‌ర‌కూ చార్జింగ్ సామ‌ర్థ్యం క‌లిగి ఉంటాయి.

First Published:  10 Sept 2023 3:01 PM IST
Next Story