Telugu Global
Business

Hyundai i20 Facelift | ఆ మూడు కార్ల‌కు హ్యండాయ్ ఐ-20 ఫేస్‌లిఫ్ట్ `టఫ్` ఫైట్‌.. ఇవీ ఫీచ‌ర్లు.. ధ‌రెంతంటే?!

Hyundai i20 Facelift | ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai) తాజాగా త‌న అప్‌డేటెడ్‌ హ్యాచ్‌బ్యాక్‌ 2023- ఐ20 కారును మార్కెట్లోకి తెచ్చింది.

Hyundai i20 Facelift | ఆ మూడు కార్ల‌కు హ్యండాయ్ ఐ-20 ఫేస్‌లిఫ్ట్ `టఫ్` ఫైట్‌.. ఇవీ ఫీచ‌ర్లు.. ధ‌రెంతంటే?!
X

Hyundai i20 Facelift | ఆ మూడు కార్ల‌కు హ్యండాయ్ ఐ-20 ఫేస్‌లిఫ్ట్ `టఫ్` ఫైట్‌.. ఇవీ ఫీచ‌ర్లు.. ధ‌రెంతంటే?!

Hyundai i20 Facelift | ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai) తాజాగా త‌న అప్‌డేటెడ్‌ హ్యాచ్‌బ్యాక్‌ 2023- ఐ20 కారును మార్కెట్లోకి తెచ్చింది. కొన్ని నెల‌ల క్రితం యూర‌ప్ మార్కెట్లో ఆవిష్క‌రించిన హ్యుండాయ్ పాపుల‌ర్ హ్యాచ్‌బ్యాక్ ఐ-20 ఫేస్‌లిఫ్ట్ ధ‌ర రూ.6.99 ల‌క్ష‌ల నుంచి ప్రారంభ‌మై రూ.11.01 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) వ‌ర‌కు ప‌లుకుతుంది. 13 ల‌క్ష‌ల మందికి పైగా క‌స్ట‌మ‌ర్ల మ‌న‌స్సు దోచిన ఐ-20 మోడ‌ల్ కారు ఆటోమొబైల్ రంగంలోనే త‌ర‌త‌రాల‌కు ఒక బ్రాండ్‌ను సెట్ చేసింద‌ని హ్యుండాయ్ మోటార్ ఇండియా సీఓఓ త‌రుణ్ గార్గ్ పేర్కొన్నారు. మారుతి సుజుకి బాలెనో, ట‌యోటా గ్లాన్జా, టాటా ఆల్ట్రోజ్ కార్ల‌కు హ్యుండాయ్ ఐ-20 ఫేస్‌లిఫ్ట్ గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని భావిస్తున్నారు.



`కారులో ప్ర‌యాణించే ప్ర‌యాణికుల సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తూ న్యూ హ్యుండాయ్ ఐ-20 కారులో స్టాండ‌ర్డ్ ఫీచ‌ర్లు ఏర్పాటు చేశాం. సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్‌, ఎల‌క్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్ అసిస్ట్ కంట్రోల్‌, వెహిక‌ల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌, 3-పాయింట్ సీట్ బెల్ట్స్‌, ప్ర‌యాణికులంద‌రికీ సీట్ బెల్ట్ రిమైండ‌ర్లు త‌దిత‌ర ఫీచ‌ర్లు జ‌త చేశాం. ప‌ట్ట‌ణ యువ‌త ఆకాంక్ష‌ల‌కు, తిరుగులేని మొబిలిటీ ఎక్స్‌పీరియ‌న్స్ అందుబాటులోకి తెస్తుంది హ్యుండాయ్ ఐ-20. క‌స్ట‌మ‌ర్ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చ‌డంతోపాటు ఐ-20 ఫేస్‌లిఫ్ట్ కారుతో వారి విశ్వాసాన్ని పొందుతాం` అని త‌రుణ్ గార్గ్ చెప్పారు.



హ్యుండాయ్ ఐ-20 న్యూ గ్రిల్లె, అలర్టెడ్ హెడ్‌ల్యాంప్స్ విత్ న్యూ ఇన్వ‌ర్టెడ్ ఎల్‌-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌, న్యూ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌, బాయ్‌నెట్‌పై న్యూ హ్యుండాయ్ లోగో వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. న్యూ అమెజాన్ గ్రే క‌ల‌ర్‌తోపాటు మ‌ల్టీపుల్ క‌ల‌ర్ ఆప్ష‌న్లు క‌స్ట‌మ‌ర్లు ఎంచుకోవ‌చ్చు. క్యాబిన్ లేఔట్ గ్రే, బ్లాక్ థీమ్స్‌లో వ‌స్తుంది. బోస్ స్పీక‌ర్ సిస్ట‌మ్‌, అంబియెంట్ లైట్స్‌, అంబియెంట్ సౌండ్స్‌, స‌న్‌రూఫ్‌, ఫ్లాట్‌-బాటం స్టీరింగ్‌, ఇన్ఫోటైన్మెంట్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే వంటి ఫీచ‌ర్లు ఉంటాయి.



6-ఎయిర్‌బ్యాగ్స్‌, ఈఎస్‌సీ, హెచ్ఏసీ, వీఎస్ఎం, ఏబీఎస్‌, ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్స‌ర్లు, రేర్ పార్కింగ్ కెమెరా, టీపీఎంఎస్‌, హెడ్ ల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్ష‌న్‌, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్‌, అన్ని సీట్ల‌కు సీట్‌బెల్ట్ రిమైండ‌ర్ల‌తోపాటు ఐ-20 ఫేస్ లిఫ్ట్‌లో 20 సేఫ్టీ ఫీచ‌ర్లు ప్రామాణికంగా ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు హ్యండాయ్ తెలిపింది. బోస్‌-సోర్స్‌డ్ సెవెన్ స్పీక‌ర్ మ్యూజిక్ సిస్ట‌మ్‌, సెమీ లెథ‌రెట్టె సీట్స్‌, ఫ్లాట్ బాటం స్టీరింగ్ వీల్‌, డోర్ ఆర్మ్ రెస్ట్స్‌, సిగ్నేచ‌ర్ ఆంబియెంట్ సౌండ్స్ ఆఫ్ నేచ‌ర్ ఫీచ‌ర్

హ్యుండాయ్ ఐ20 కారు ఇంజిన్ 1.2 లీట‌ర్ల ఫోర్ సిలిండ‌ర్ నేచుర‌ల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్ క‌లిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్ మిష‌న్‌, ఐవీటీ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ క‌లిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 83 బీహెచ్‌పీ విద్యుత్‌, 114.7 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. ఇంకా ఇంటిగ్రేటెడ్ స్టార్ట‌ర్ జెన‌రేట‌ర్ కూడా ఉంటుంది. కొత్త ఐ-20 ఫేస్‌లిఫ్ట్ కారులో ట‌ర్బో పెట్రోల్ ఇంజిన్ ఆఫ‌ర్ లేనే లేదు.



హ్యుండాయ్ 2023 ఐ20 ఫేస్‌లిఫ్ట్ ధ‌ర వ‌ర‌లు ఇలా

హ్యుండాయ్ 2023 ఐ20 ఫేస్‌లిఫ్ట్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఎరా - రూ. 6.99 ల‌క్ష‌లు

హ్యుండాయ్ 2023 ఐ20 ఫేస్‌లిఫ్ట్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ మాగ్నా- రూ.7.69 ల‌క్ష‌లు

హ్యుండాయ్ 2023 ఐ20 ఫేస్‌లిఫ్ట్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ స్పోర్ట్జ్ - రూ. 8.32 ల‌క్ష‌లు

హ్యుండాయ్ 2023 ఐ20 ఫేస్‌లిఫ్ట్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆస్టా - రూ. 9.28 ల‌క్ష‌లు

హ్యుండాయ్ 2023 ఐ20 ఫేస్‌లిఫ్ట్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆస్టా (ఓ) - రూ. 9.97 ల‌క్ష‌లు

హ్యుండాయ్ 2023 ఐ20 ఫేస్‌లిఫ్ట్ ఐవీటీ స్పోర్ట్స్ - రూ. 9.37 ల‌క్ష‌లు

హ్యుండాయ్ 2023 ఐ20 ఫేస్‌లిఫ్ట్ ఐవీటీ ఆస్టా (ఓ) - రూ.11.01 ల‌క్ష‌లు

First Published:  12 Sept 2023 10:57 AM IST
Next Story