Telugu Global
Business

అక్టోబర్‌లో గ‌ణ‌నీయంగా పెరిగిన దేశీయ విమాన ట్రాఫిక్ - ఆన్ టైమ్ ఫెర్ఫామెన్స్(OTP) టాప్‌లో టాటా గ్రూప్‌

అక్టోబర్ నెల‌లో దేశీయ (డొమెస్టిక్‌) విమానాల‌లో 1.14 కోట్ల మంది ప్రయాణించారు. సెప్టెంబర్‌లో ప్రయాణించిన వారి సంఖ్య కంటే ఇది 10 శాతం ఎక్కువగా ఉంది. దీన్ని విమాన‌యాన సంస్థ‌లు శుభ‌ప‌రిణామంగా భావిస్తున్నాయి.

అక్టోబర్‌లో గ‌ణ‌నీయంగా పెరిగిన దేశీయ విమాన ట్రాఫిక్    - ఆన్ టైమ్ ఫెర్ఫామెన్స్(OTP) టాప్‌లో టాటా గ్రూప్‌
X

కరోనా కారణంగా దేశీయ విమానయాన పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ప‌డిన త‌రువాత ఇటీవలి కాలంలో మ‌ళ్లీ పుంజుకుంటోంది. అక్టోబర్ నెల‌లో దేశీయ (డొమెస్టిక్‌) విమానాల‌లో 1.14 కోట్ల మంది ప్రయాణించారు. సెప్టెంబర్‌లో ప్రయాణించిన వారి సంఖ్య కంటే ఇది 10 శాతం ఎక్కువగా ఉంది. దీన్ని విమాన‌యాన సంస్థ‌లు శుభ‌ప‌రిణామంగా భావిస్తున్నాయి.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) విడుదల చేసిన డేటా ప్రకారం దేశీయ విమానాల రాకపోకలు గత నెల(89.85 లక్షల)తో పోలిస్తే దాదాపు 27 శాతం పెరిగి 114.07 లక్షలకు చేరుకున్నాయి.

సెప్టెంబర్‌లో విమాన ట్రాఫిక్ సంఖ్య 103.55 లక్షలుగా ఉంది. అక్టోబర్‌లో ప్రయాణికుల సంఖ్య 1.14 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్‌లో ప్రయాణించిన వారి సంఖ్య కంటే ఇది 10 శాతం ఎక్కువ.

అక్టోబర్‌లో ఎయిర్ ట్రాఫిక్‌లో, ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా 9.1 శాతంగా ఉండగా, స్పైస్‌జెట్ 7.3 శాతం, గో ఫస్ట్ 7 శాతంగా న‌మోదైంది. అక్టోబరులో ఎయిర్ ఏషియా (AirAsia) ఇండియా మార్కెట్ వాటా 7.6 శాతానికి పెరిగింది. అదే సమయంలో అలయన్స్ ఎయిర్ మార్కెట్ వాటా స్వల్పంగా (1.3 శాతం) పెరిగింది.

అక్టోబర్‌లో ఆన్-టైమ్ పనితీరు (OTP) పరంగా, ఎయిర్ ఇండియా 90.8 శాతంతో అగ్రస్థానంలో ఉంది, తరువాత విస్తారా (89.1 శాతం), ఎయిర్ ఏషియా ఇండియా (89.1 శాతం) ఉన్నాయి. ఈ మూడు విమానయాన సంస్థలు టాటా గ్రూపులోవే కావ‌డం విశేషం. ఇండిగో OTP 87.5 శాతం, అలయన్స్ ఎయిర్ (74.5 శాతం), స్పైస్‌జెట్ (68.9 శాతం), గో ఫస్ట్ (60.7 శాతం) ఉన్నాయి.

నాలుగు మెట్రో విమానాశ్రయాల (బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై) OTPని డీజీసీఏ విశ్లేషించింది. 2022(జనవరి-అక్టోబర్)లో దేశీయ విమానయాన సంస్థల ద్వారా 988.31 లక్షల మంది ప్రయాణించిన‌ట్లు డీజీసీఏ వెల్ల‌డించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో ప్ర‌మాణించిన వారి సంఖ్య 620.96 లక్షలుగా ఉంది. ఈ గ‌ణంగాల‌ను బ‌ట్టి దేశీయ విమాన వార్షిక వృద్ధి 59.16 శాతంగా న‌మోదంది. నెలవారీ వృద్ధిని లెక్కించాల్సి వ‌స్తే ఇది 26.95 శాతంగా ఉంద‌ని అని డీజీసీఏ తెలిపింది.

First Published:  23 Nov 2022 12:06 PM IST
Next Story