Telugu Global
Business

గిన్నిస్ బుక్ ఎలా పుట్టిందో తెలుసా?

గిన్నిస్ బుక్ గురించి తెలియని వారుండరు. అందరికీ సాధ్యం కాని అద్భుతమైన పనులు చేసినపప్పుడు వాళ్ల పేర్లు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిస్తుంటారు.

Do you know how the Guinness Book of World Records was born?
X

గిన్నిస్ బుక్ ఎలా పుట్టిందో తెలుసా?

గిన్నిస్ బుక్ గురించి తెలియని వారుండరు. అందరికీ సాధ్యం కాని అద్భుతమైన పనులు చేసినపప్పుడు వాళ్ల పేర్లు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిస్తుంటారు. అయితే ఇంత గొప్ప పేరున్న ఈ బుక్.. ఎలా పుట్టిందో తెలుసా?


గిన్నిస్ బుక్ పేరులో ‘గిన్నిస్’ అనేది ఒక బీరు కంపెనీ పేరు. సర్ హగ్‌ బీవర్‌ అనే వ్యక్తికి ఐర్లాండ్‌లో ‘ఆర్థర్ గిన్నిస్’ అనే బీరు కంపెనీ ఉంది. బీవర్1950లో ఒకసారి ఫ్రెండ్స్‌తో కలిసి వేట కోసం అడవికి వెళ్లాడు. వాళ్ల మాటల మధ్యలో ‘యూరప్‌లో వేగంగా ఎగిరే పక్షి ఏది?’ అన్న టాపిక్ వచ్చింది. దానికి ఎవరూ ఆన్సర్ చెప్పలేకపోయారు. దాంతో బీవర్ చాలా పుస్తకాలను తిరగేశాడు. ఎక్కడా దాని గురించి రాసి లేదు. ఎంతోమందిని అడిగి చూశాడు. కానీ, లాభం లేదు.


అప్పుడు బీవర్‌‌కు ఓ ఐడియా వచ్చింది ‘అరుదైన విషయాలను నమోదు చేసే పుస్తకం ఒకటి ఉంటే బాగుంటుంది’ అని. అలా కొన్నేండ్లు రీసెర్చ్ చేసి రకరకాల విషయాలు సేకరించి ఒక పుస్తకంలో రాశాడు.


ఆ పుస్తకానికి ‘గిన్నిస్ బుక్’ అని పేరు పెట్టాడు. 1954లో గిన్నిస్‌ బుక్‌ను వెయ్యి కాపీలు ప్రింట్ తీసి మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. అందులో ప్రపంచంలో పొడవైన వ్యక్తి, వేగంగా పరిగెత్తే మనిషి ఇలా.. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. 197 పేజీలు ఉండే ఆ బుక్ అప్పట్లో తెగ అమ్ముడుపోయింది.


ఆ తర్వాత రకరకాల దేశాల నుంచి రకరకాల రికార్డుల వివరాలు బీవర్‌‌కు వచ్చేవి. వాళ్ల రికార్డులను కూడా పుస్తకంలో ఎంటర్ చేయమని అడిగేవాళ్లు. అలా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ మొదలైంది. ఇప్పటికీ దీనికి ఏటా 110 దేశాల నుంచి 35 వేలకు పైగా రికార్డ్ రిక్వెస్టులు వస్తుంటాయి. వందకు పైగా దేశాల్లో 13 కోట్లకు పైగా కాపీలతో 25 భాషల్లో అమ్ముడైన ఏకైక పుస్తకం ఇదే.

First Published:  15 March 2023 6:16 PM IST
Next Story