Citroen C3 Aircross | మారుతి గ్రాండ్ విటారా సహా ఆ నాలుగు ఎస్‌యూవీలతో `సై` అంటే `సై`.. మార్కెట్లోకి సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్.. ధరెంతంటే..?!
సిట్రోన్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ సీ3 ఎయిర్ క్రాస్ కారు పట్ల ఆసక్తి గల వారు రూ.25 వేలు టోకెన్ మొత్తం చెల్లించి ప్రీ-బుకింగ్స్ చేసుకోవచ్చు. వచ్చేనెల 15 నుంచి కార్ల డెలివరీ ప్రారంభం అవుతుంది.
Citroen C3 Aircross | ప్రముఖ ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) గత ఏప్రిల్‌లో ఆవిష్కరించిన మిడ్‌సైజ్ ఎస్‌యూవీ సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్ (Citroen C3 Aircross)ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara), టయోటా హైరైడర్ (Toyota Hyryder), స్కోడా కుషాక్ (Skoda Kushaq), కియా సెల్టోస్ (Kia Seltos), హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta) తదితర ఎస్‌యూవీలతో తల పడుతుంది.
భారత్‌లో సిట్రోన్ సీ3 ఎయిర్‌క్రాస్ కారు ధర రూ.9.90 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. సీ3 ఎయిర్‌క్రాస్ మూడు వేరియంట్లు - యూ, ప్లస్, మ్యాక్స్‌ల్లో లభిస్తుంది. ఐదు లేదా ఏడు సీటర్ల కాన్ఫిగరేషన్‌తో మూడు వేరియంట్ కార్లు అందుబాటులో ఉంటాయి.
సిట్రోన్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ సీ3 ఎయిర్ క్రాస్ కారు పట్ల ఆసక్తి గల వారు రూ.25 వేలు టోకెన్ మొత్తం చెల్లించి ప్రీ-బుకింగ్స్ చేసుకోవచ్చు. వచ్చేనెల 15 నుంచి కార్ల డెలివరీ ప్రారంభం అవుతుంది. దేశవ్యాప్తంగా గల లా మైసన్ సిట్రోన్ షోరూమ్‌లు, సిట్రోన్ ఇండియా వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.
సిట్రోన్ సీ ఎయిర్‌క్రాస్ 1.2 -లీటర్ల టర్బో చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 109 బీహెచ్‌పీ విద్యుత్, 190 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తోపాటు పలు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. లీటర్ పెట్రోల్‌పై 18.5 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఇండోనేషియాలో విడుదల చేసిన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ లీటర్ పెట్రోల్‌పై 17.5 కి.మీ మైలేజీ మాత్రమే ఇస్తుంది.
సిట్రోన్ సీ3 ఎయిర్‌క్రాస్ 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫోర్ స్పీకర్స్ విత్ టూ ట్వీటర్స్, మాన్యువల్ ఏసీ, రూఫ్ మౌంటెడ్ రేర్ ఏసీ వెంట్స్, ఎలక్ట్రికల్టీ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎంస్, టైర్ ప్రెషర్ మానిటర్, కీ లెస్ ఎంట్రీ, రేర్ వైఫర్ విత్ వాషర్, రేర్ డీఫాగర్, మాన్యువల్ ఐఆర్వీఎం తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు 4300 ఎంఎం పొడవు, 2671 ఎంఎం వీల్ బేస్, 200 గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తున్నది. 5-సీట్స్ లే ఔట్ గ్లాస్ లీడింగ్ బూట్ స్పేస్ 478 లీటర్లు ఉంటుంది.