BPCL SBI Card OCTANE | పెట్రోల్, గ్రాసరీ బిల్లు ఆదా చేయాలంటే ఈ క్రెడిట్ కార్డు బెస్ట్.. ఇవీ బెనిఫిట్లు.. !
BPCL SBI Card OCTANE | బంగారం ధర పెరిగినా.. అగ్ర రాజ్యాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినా , అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచినా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతాయి.
BPCL SBI Card OCTANE | బంగారం ధర పెరిగినా.. అగ్ర రాజ్యాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినా , అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచినా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతాయి. దీని ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపైనా ప్రభావం పడుతుంది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే మధ్య తరగతి ప్రజల జీవనంపై ప్రభావం చూపుతుంది. ప్రత్యేకించి ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులైనా, ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లోఉద్యోగాలు చేస్తున్న వారి నెలవారీ ఖర్చులు పెరుగుతాయి.
ఆఫీసుకు వెళ్లాలన్నా,నా, బయటికి వెళ్లాలన్నా.. ఇప్పుడు ఒక మోటారు సైకిల్, ఒక స్కూటర్ కావాలి. ఆ స్కూటర్ లేదా బైక్ పెట్రోల్ బిల్లు పెరిగితే కుటుంబ జీవనంపైనా, ఖర్చులపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. అలా జరక్కుండా ఖర్చులు తగ్గించుకోవాలంటే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ అనుబంధ క్రెడిట్ కార్డు సంస్థ `ఎస్బీఐ కార్డ్స్`తన ఖాతాదారుల కోసం కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు తీసుకొచ్చింది.
ఇందుకోసం కేంద్ర ముడి చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) తో జత కట్టింది ఎస్బీఐ కార్డ్. బీపీసీఎల్ ఎస్బీఐ కార్డ్ ఒక్టేన్ (BPCL SBI Card OCTANE) తీసుకు వచ్చింది. ఈ కార్డుపై ఫ్యుయల్ కొనుగోళ్లు, గ్రాసరీ, డిపార్ట్‌మెంటల్ స్టోర్ వస్తువులు, రెస్టారెంట్లలో డైనింగ్, సినిమా టికెట్ల కొనుగోళ్లపై ఇన్సెంటివ్‌లు, అద్బుతమైన బెనిఫిట్లు అందుబాటులో ఉన్నాయి.
బీపీసీఎల్ ఎస్బీఐ కార్డ్ ఒక్టేన్ (BPCL SBI Card OCTANE) తో బెనిఫిట్లు ఇవీ
వెల్‌కం బెనిఫిట్లు : జాయినింగ్ ఫీజు చెల్లింపుతో రూ.1500 విలువైన 6000 రివార్డు పాయింట్లు.
రివార్డ్ పాయింట్లు : బీపీసీఎల్ పెట్రోల్ పంపుల వద్ద పెట్రోల్, లూబ్రికెంట్లు, భారత్ గ్యాస్ (వెబ్‌సైట్ అండ్ అప్లై ఓన్‌లీ) కొనుగోలుపై ప్రతి రూ.100లపై 25 రివార్డు పాయింట్లు. బిల్లింగ్ సైకిల్‌పై గరిష్టంగా 2500 రివార్డు పాయింట్లు లభ్యం.
డిపార్ట్‌మెంటల్ స్టోర్లు, గ్రాసరీ స్టోర్లు, రెస్టారెంట్లలో డైనింగ్, సినిమా టికెట్ల కొనుగోళ్లపై ప్రతి రూ.100 పై పది రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఇతర సంస్థల పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ కొనుగోళ్లు, మొబైల్ వ్యాలెట్ అప్‌లోడ్‌పై రూ.100 ఖర్చుపై ఒక రివార్డు పాయింట్ లభ్యం.
మైలురాయి బెనిఫిట్: వార్షిక స్పెండింగ్ రూ.3 లక్షల మార్క్ దాటితే రూ.2000 విలువైన ఈ-గిఫ్ట్ ఓచర్ లభ్యం.
ప్రతి త్రైమాసికానికొకసారి దేశీయ విమానాశ్రయ లాంజ్‌లోకి కాంప్లిమెంటరీ పాస్.
ఏడాదిలో రూ.2 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక ఫీజు మాఫీ.
బీపీసీఎల్ పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ నింపుకున్న వారికి ఒకశాతం ఫ్యుయల్ సర్ చార్జీ మాఫీ.
రూ.లక్ష వరకు కాంప్లిమెంటరీ ఫ్రాడ్ లియబిలిటీ కవరేజీ లభ్యం.
పెట్రోల్, గ్రాసరీ, డిపార్ట్ మెంటల్ స్టోర్ వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఈ క్రెడిట్ కార్డుపై లభించే బెనిఫిట్లు చాలా ఉపయోగంగా ఉంటాయి. బీపీసీఎల్ పెట్రోల్ పంపుల్లో పెట్రోల్, లూబ్రికెంట్ల కొనుగోళ్లపై ఒక శాతం ఫ్యుయల్ సర్ చార్జి మాఫీతోపాటు 7.25 శాతం సొమ్ము ఆదా అవుతుంది. భారత్ గ్యాస్ కొనుగోళ్లపై 6.25 శాతం బెనిఫిట్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా 17 వేలకు పైగా బీపీసీఎల్ పెట్రోల్ బంకుల వద్ద ఈ కార్డు సేవలు ఉపయోగించుకోవచ్చు.