యాక్సిస్ నిఫ్టీ500 వేల్యూ 50 ఈటీఎఫ్‌ను ప్రవేశపెట్టిన యాక్సిస్ మ్యుచువల్ ఫండ్
యాక్సిస్ నిఫ్టీ500 వేల్యూ 50 ఈటీఎఫ్‌కి సంబంధించి న్యూ ఫండ్ ఆఫర్‌ను ప్రకటించింది.

భారత్‌లోని దిగ్గజ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో ఒకటైన యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ తమ కొత్త ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) – యాక్సిస్ నిఫ్టీ500 వేల్యూ 50 ఈటీఎఫ్‌కి సంబంధించి న్యూ ఫండ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది నిఫ్టీ500 వేల్యూ 50 టీఆర్‌ఐని ప్రతిఫలించే/ట్రాక్ చేసే ఓపెన్ ఎండెడ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. వేల్యూ ఆధారిత వ్యూహాలతో భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడంలో ఇన్వెస్టర్లకు సహాయకరంగా ఉండేలా ఈ ఈటీఎఫ్ రూపొందించబడింది. వృద్ధి చెందుతున్న భారత ఈక్విటీ మార్కెట్లలో వైవిధ్యమైన విధంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ కొత్త ఈటీఎఫ్ చౌకైన, పారదర్శకమైన, పన్నులపరంగా ప్రయోజనాలు చేకూర్చే పెట్టుబడి అవకాశంగా ఉంటుంది.
ఈ స్కీము ప్రధానంగా నిర్దేశిత సూచీలోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది. అలాగే అసెట్ అలొకేషన్ ధోరణికి అనుగుణంగా లిక్విడిటీ, వ్యయాల అవసరాల కోసం నిబంధనలకు తగ్గట్లుగా డెట్ మరియు మనీ మార్కెట్ సాధనాల్లో కూడా ఈ స్కీము ఇన్వెస్ట్ చేయొచ్చు. లిక్విడిటీ మరియు వ్యయాల అవసరాల నిమిత్తం మినహా, ప్యాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ విధానంతో, సాధ్యమైనంత వరకు నిర్దేశిత సూచీ యొక్క నిష్పత్తికి అనుగుణంగా ఇండెక్స్‌లోని స్టాక్స్‌లో ఈ స్కీమ్ ఇన్వెస్ట్ చేస్తుంది.
ఈ ఓపెన్ ఎండెడ్ ఈటీఎఫ్‌లో కనీసం రూ. 500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత నుంచి రూ. 1 గుణిజాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఈటీఎఫ్ విస్తృతమైన, డైవర్సిఫైడ్ బాస్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఇన్వెస్టర్లకు లిక్విడిటీ మరియు ఎక్స్చేంజ్ ద్వారా ట్రేడింగ్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించే విధంగా ఎన్ఎస్ఈ, బీఎస్‌ఈల్లో యాక్సిస్ నిఫ్టీ500 వేల్యూ 50 ఈటీఎఫ్ లిస్ట్ చేయబడుతుంది.