IT Returns | ఐటీఆర్ ప్రాసెసింగ్ టైం కేవలం 10 రోజులేనా.. అయినా.. ?
IT Returns | ఐటీ రిటర్న్స్ వెరిఫికేషన్ తర్వాత ప్రాసెసింగ్ సమయం సగటున 10 రోజులకు తగ్గిపోయిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్‌ల ప్రాసెసింగ్‌కు 82 రోజులు పడితే 2022-23లో సరాసరి 16 రోజులకు దిగి వచ్చిందని ఓ ప్రకటనలో వెల్లడించింది.
IT Returns | ఐటీ రిటర్న్స్ వెరిఫికేషన్ తర్వాత ప్రాసెసింగ్ సమయం సగటున 10 రోజులకు తగ్గిపోయిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్‌ల ప్రాసెసింగ్‌కు 82 రోజులు పడితే 2022-23లో సరాసరి 16 రోజులకు దిగి వచ్చిందని ఓ ప్రకటనలో వెల్లడించింది. మంగళవారం నాటికి గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో దాఖలైన 6.98 కోట్ల ఐటీఆర్‌ల్లో 6.84 కోట్ల ఐటీఆర్‌లు వెరిఫైడ్ చేశారు. వాటిల్లో ఆరు కోట్లకు పైగా ఐటీఆర్‌ల ప్రాసెసింగ్ పూర్తయిందని సీబీడీటీ తెలిపింది. ఈ-వెరిఫైడ్ ఐటీఆర్‌ల్లో 88 శాతానికి పైగా ప్రాసెసింగ్ పూర్తి చేశామని వెల్లడించింది. వాటిలో 2.45 కోట్లకు పైగా ఐటీ రీఫండ్స్ జారీ చేసినట్లు తెలిపింది.
ఇంకా చాలా ఐటీఆర్‌లను ఆదాయం పన్ను విభాగం ప్రాసెసింగ్ పూర్తి చేయలేదు. ఐటీఆర్‌ల్లో క్లయిమ్‌ల మేరకు వాటి ప్రాసెసింగ్ పూర్తయి రీఫండ్స్ తమ బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ కావడం లేదని పలువురు టాక్స్ పేయర్లు ఐటీఆర్‌ల ప్రాసెసింగ్‌కు సుదీర్ఘ కాలం సమయం తీసుకోవడంపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలతో పోస్టులు పెడుతున్నారు.
సకాలంలో ఐటీఆర్‌ల ప్రాసెసింగ్ కాకపోవడానికి కారణాలను ఆదాయం పన్ను విభాగం వెల్లడించింది.
♦ సెప్టెంబర్ నాలుగో తేదీ నాటికి గత ఆర్థిక సంవత్సరం ఐటీఆర్‌ల్లో సుమారు 14 ఐటీఆర్‌లను టాక్స్ పేయర్లు ఇంకా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయలేదు. రిటర్న్స్ వెరిఫికేషన్‌లో వైఫల్యం వల్లే ప్రాసెసింగ్‌లో జాప్యానికి కారణం అవుతుంది. ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే ప్రాసెసింగ్ ప్రక్రియ చేపడతామని ఆదాయం పన్ను విభాగం తెలిపింది. సాధ్యమైనంత త్వరగా పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ల ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది.
♦ దాదాపు 12 లక్షల ఐటీఆర్‌లకు సంబంధించి అదనపు సమాచారం అందజేయాలని ఆయా పన్ను చెల్లింపుదారులకు వారి ఈ-ఫైలింగ్ ఖాతాల ద్వారా సమాచారం ఇచ్చాం అని ఆదాయం పన్ను విభాగం తెలిపింది. కనుక వేతన జీవులు లేదా పన్ను చెల్లింపుదారులు సాధ్యమైనంత త్వరగా సమాధానం ఇవ్వాలని కోరింది.
♦ ఈ పరిస్థితుల్లోనే ఐటీఆర్‌ల ప్రాసెసింగ్ పూర్తయి, పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ చేస్తామని ఐటీ విభాగం స్పష్టం చేసింది. ఇక పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్స్ క్రెడిట్ కావడానికి ధృవీకృత బ్యాంకు ఖాతాల వివరాలు తెలియజేయకపోవడం వల్ల కూడా రీఫండ్ చేయలేకపోతున్నట్లు వివరణ ఇచ్చింది.
♦ ఈ-ఫైలింగ్ వ్యవస్థలో పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంకు ఖాతాలను ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ఐటీఆర్ ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత సంబంధిత పన్ను చెల్లింపుదారుడికి ఆదాయం పన్ను చట్టం 143 (1) సెక్షన్ కింద నోటీసులు జారీ చేస్తుంది. టాక్స్ డిమాండ్ నోటీసు, ఇన్‌కం టాక్స్ రీఫండ్ డ్యూ, టాక్స్ డిమాండ్ లేదా రీఫండ్ నోటీసు పంపవచ్చు.