అమెజాన్ ఇయర్ ఎండింగ్ సేల్.. ఈ ఫోన్లపై మంచి డీల్స్!
ఏడాది ముగుస్తు్న్న సందర్భంగా ఇయర్ ఎండింగ్ సేల్‌ను ప్రకటించింది ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్.
ఏడాది ముగుస్తు్న్న సందర్భంగా ఇయర్ ఎండింగ్ సేల్‌ను ప్రకటించింది ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్. ఈ సేల్‌లో పలు స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్ ఫోన్లకు ఉండే మాన్యుఫాక్చరింగ్ డేట్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వంటి అంశాల దృష్ట్యా ఏడాది మారే సమయంలో ఎలాగైనా మొబైల్స్‌ను విక్రయించాలనుకుంటాయి షాపింగ్ సంస్థలు. అందులో భాగంగానే ఇయర్ ఎండింగ్ టైంలో క్లియరెన్స్ సేల్స్ వంటివి ప్రకటిస్తుంటాయి. అటువంటిదే అమెజాన్ ఇయర్ ఎండింగ్ సేల్ కూడా. కొత్త మొబైల్ కొనాలనునేవాళ్లు ఈ డీల్స్‌పై ఓ లుక్కేయొచ్చు.
అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్‌లో యాపిల్ ఐ-ఫోన్ 13.. రూ. 52,499కు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.69,900. ఇందులో ఏ15 బయోనిక్ చిప్‌సెట్‌తో పాటు 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంటుంది. 12-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది.
ఈ సేల్‌లో ఐకూ ఫోన్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఐక్యూ నియో7 5జీ ఫోన్ రూ. 24,999కు లభిస్తుంది. దీని అసలు ధర రూ.34,999. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లే.. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుది.
ఐకూకి చెందిన మరో ఫోన్.. జడ్7 ప్రో 5జీ.. ఆఫర్లతో కలిపి రూ. 21,999కి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 26,999. ఇది 6.7 ఇంచెస్ త్రీడీ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.
ఇక ఈ సేల్‌లో శాంసంగ్ స్మార్ట్ ఫోన్లపై కూడా పలు ఆఫర్లు ఉన్నాయి. రూ. 24,499 ధర కలిగిన శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్.. రూ.18,499కి లభిస్తోంది. ఇది ఎక్సినోస్ 1280 ఎస్వోసీ చిప్‌పై పనిచేస్తుంది. 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లేతో వస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా ఉంటుంది.
వీటితోపాటు వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 5జీ.. ధర రూ. 24,999 కాగా రూ. 21,999కి అందుబాటులో ఉంది. రెడ్‌మీ 12 5జీ.. ధర రూ. 19,999 కాగా రూ. 14,499కి లభిస్తోంది. రియల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ ధర రూ. 14,999 కాగా రూ. 12,999 కి అందుబాటులో ఉంది. రెడ్ మీ 12సీ ఫోన్ ధర రూ.13,999 కాగా రూ.6,999కే అందుబాటులో ఉంది. రెడ్ మీ నోట్ 12 ధర రూ.18,999కాగా రూ.10,499కే అందుబాటులో ఉంది. అయితే ఆఫర్లలో మొబైల్స్ కొనేటప్పుడు మాన్యుఫాక్చరింగ్ డేట్, అప్‌డేట్స్ ఎన్నేళ్లు వస్తాయి వంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటే మంచిది.