Telugu Global
Business

అమెజాన్ ఎయిర్ సర్వీసెస్..ఇకపై మరింత వేగంగా డెలివరీ!

అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఏదైనా ఆర్డర్ చేస్తే అత్యంత వేగంగా డెలివరీ అయ్యేలా ఎయిర్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి ‘అమెజాన్ ఎయిర్ సర్వీస్’ అని పేరు పెట్టింది.

Amazon Fast Delivery Service
X

అమెజాన్ ఎయిర్ సర్వీసెస్

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. మనదేశంలో డెలివరీ స్పీడ్‌ను పెంచేందుకు ఫ్లైట్‌లను ఉపయోగించాలని నిర్ణయించుకుంది. అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఏదైనా ఆర్డర్ చేస్తే అత్యంత వేగంగా డెలివరీ అయ్యేలా ఎయిర్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి ‘అమెజాన్ ఎయిర్ సర్వీస్’ అని పేరు పెట్టింది. ఈ సర్వీసు ద్వారా దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్ డెలివరీల స్పీడ్ పెరగనుంది.

నిజానికి అమెజాన్ ఎయిర్ సర్వీస్ అమెరికా, యూరప్‌లో ఎప్పటినుంచో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఇండియాకు తమ ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసును తీసుకొచ్చింది అమెజాన్. దీనికోసం బెంగళూరుకు చెందిన కార్గో ఎయిర్‌లైన్ క్విక్‌జెట్‌తో కలిసి పనిచేస్తోంది.


అమెజాన్.. ఎయిర్ సర్వీసు కోసం బోయింగ్ 737, బోయింగ్ 800 విమానాలను వాడుతుంది. అమెజాన్‌కు ఇండియాలో పెరుగుతున్న కస్టమర్లు, ఆర్డర్ల కారణంగా.. దేశంలో వేగవంతమైన డెలివరీలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


అందులో భాగంగానే ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అమెజాన్ గ్లోబల్ ఎయిర్‌‌వేస్ ప్రసిడెంట్ సారా రోడ్స్ తెలిపారు. ఈ సర్వీస్‌లో భాగంగా అమెజాన్ విమానం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు కస్టమర్ షిప్‌మెంట్‌లను రవాణా చేస్తుంది. ఈ సర్వీస్‌ ద్వారా భారత్‌లో అత్యంత వేగంగా డెలివరీలను అందించడమే కాకుండా ఖర్చులను కూడా ఆదా చేయొచ్చని కంపెనీ అంటోంది.

First Published:  25 Jan 2023 12:55 PM IST
Next Story